వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: గుడ్డు తినటం మంచిదే.. కానీ వీళ్ళు తినటం ప్రమాదకరం!!

|
Google Oneindia TeluguNews

గుడ్లు.. మంచి పౌష్టికాహారం. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. ఇక ప్రభుత్వాలు కూడా ప్రతిరోజు ఒక గుడ్డు తినడం మంచిదని, దీనివల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయని చెబుతున్నాయి. అయితే రోజుకు ఒక గుడ్డు అయితే పర్వాలేదు, కానీ కొందరు గుడ్లు విపరీతంగా తింటూ ఉంటారు. అయితే అది ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు.

గుడ్లు తినడం మంచిదే అయినా, కొంతమంది గుడ్లు తినడం డేంజర్ అని చెబుతున్నారు. ఎవరు గుడ్లు తినకూడదు? ఎందుకు వారు గుడ్లు తింటే ప్రమాదం? అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్లు చాలామందికి ఇష్టమైన ఆహారాలలో ఒకటి. పోషకాలతో నిండి ఉన్న గుడ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన జుట్టు నుండి చర్మం వరకు ప్రతి ఒక్కటి ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు ఎంతగానో దోహదం చేస్తాయి.

health tips: It is good to eat egg.. but it is dangerous for them to eat egg!!

అయితే వివిధ అనారోగ్య సమస్యలతో ఉన్న కొందరు పొరపాటున కూడా గుడ్లు తినకూడదు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా గుడ్లు తినకూడదు. అలా తింటే వారికి అజీర్ణ సమస్య మరింత పెరుగుతుంది. విపరీతంగా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కూడా గుడ్లకు దూరంగా ఉండాలి. గుడ్డు సొన కొలెస్ట్రాల్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఇక గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారు, కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా గుడ్డును తినకూడదు. గుడ్డులో సంతృప్త కొవ్వు ఉండటం వల్ల అది ఈ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మరింత అనారోగ్యం కలిగిస్తుంది.

అంతేకాదు అలర్జీ ఉన్నవారు గుడ్లు తినకూడదు. అధిక బరువు ఉన్నవారు సైతం గుడ్లను తక్కువగా తినాలి. ఒకవేళ తిన్న గుడ్డులో పచ్చ సొన కాకుండా తెల్ల సొన మాత్రమే తినాలి. ఒకవేళ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గుడ్లను తినాలని ఫీలయ్యేవారు, వారు ఏ మేరకు గుడ్లను తినొచ్చు అన్న విషయాన్ని వైద్యులను కానీ న్యూట్రిషనిస్ట్ లను గాని సంప్రదించి తెలుసుకోవాలి.

disclaimer: ఈ కథనం ఆహార నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Although eating eggs is good, but eating eggs is dangerous to some people who are facing health issues. Who should not eat eggs? Why is it dangerous if they eat eggs? Everyone needs to know that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X