health tips: సొరకాయలను ఈ మూడు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినొద్దు!!
సొరకాయ.. కొన్ని ప్రాంతాలలో ఆనపకాయగా పిలువబడే సొరకాయ మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. చాలా వ్యాధులకు సొరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. సొరకాయ జ్యూస్ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి, టాక్సిన్లు బయటకు పోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక అటువంటి సొరకాయ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తినకుండా ఉండాలని చెబుతున్నారు వైద్యులు.
సొరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలు దూరం చేస్తాయి. సొరకాయలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి . ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్ తో పాటుగా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయని చెబుతారు. సొనకాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరం నుండి కొవ్వును మరియు పైత్యాన్ని విసర్జించడంలో సహాయపడుతుందని, కాలేయ వ్యాధుల చికిత్సలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతారు.

అంతేకాదు శరీరంలో అధికంగా వేడి ఉన్నవారు, పైల్స్, మలబద్ధకం, వేడి కురుపులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సొరకాయ తింటే మంచిదని, సొరకాయ శరీరాన్ని చల్లబరుస్తుందని చెబుతున్నారు. సొరకాయలో ఫైబర్ ఉండడంతో అది మలబద్ధకాన్ని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. సొరకాయ రక్తంలో ఉండే చక్కెర , ట్రై గ్లిజరైడ్స్ మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించడంలో సొరకాయ కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
అయితే ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ, ఎన్నో రోగాలకు ఉపయోగపడుతున్నప్పటికీ, కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు సొరకాయలు ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా మూడు వ్యాధులతో బాధపడేవారు సొరకాయని తింటే ప్రమాదం అని చెబుతున్నారు. జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్య ఉన్నవారు జాగ్రత్త వహించాలని వారు సొరకాయలను తినకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్ కైటిస్ సమస్యలు ఉన్నవారు సొరకాయ జ్యూస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications