Health tips: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీ గుండెకు ముప్పే.. జాగ్రత్త!!

చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం ఆరోగ్యమని ఫీల్ అవుతూ ఉంటారు. బరువు తగ్గడానికి చేసే డైటింగ్ లో అల్పాహారం తీసుకోకపోవడం ఒక భాగమని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం చాలా డేంజర్ అండ్ హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.

బ్రేక్ ఫాస్ట్ చెయ్యని వారికి గుండె పోటు ముప్పు

బ్రేక్ ఫాస్ట్ చెయ్యని వారికి గుండె పోటు ముప్పు

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చెయ్యని వాళ్లలో వ్యాధినిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తిని కూడా శరీరం పోగొట్టుకుంటుందని సూచిస్తున్నారు. అంతే కాదు మరో ముఖ్యమైన విషయం కూడా వెల్లడించారు వైద్యులు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో గుండెపోటు ముప్పు చాలా ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం కూడా ఈ విషయాన్ని వెల్లడించిందని, ఆరోగ్యం కోసం చేసే ఫాస్టింగ్ లలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి మన ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణం ఇదే

ఇటీవల పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణం ఇదే


ఇటీవల కాలంలో మనం తరచూ వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తున్నాం. చిన్న చిన్న వయసులలో, ఊబకాయం సమస్య లేకపోయినప్పటికీ, ఇతరత్రా అనారోగ్య సమస్యలు లేకున్నా కూడా ఎంతోమంది చనిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం మనల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం పోషకాహార లోపం, సరైన సమయంలో తినకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడంగా చెప్పవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ తో శరీరానికి కావాల్సిన పోషకాలు

బ్రేక్ ఫాస్ట్ తో శరీరానికి కావాల్సిన పోషకాలు

కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కచ్చితంగా ప్రతి ఒక్కరు సమయానుకూలంగా పోషకాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పుష్కలంగా లభిస్తాయని, మన శరీరం శక్తివంతంగానూ, ఆరోగ్యంగానూ ఉండడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఆహారాన్ని తీసుకోకూడదు అనుకుంటే అది రాత్రి వేళల్లో బాగా ఆలస్యమైతే తీసుకోకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కడుపునిండా తినాలని, మధ్యాహ్నం లంచ్ మితంగా తినాలని, రాత్రి డిన్నర్ ఏడు గంటల లోపే పూర్తి చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకుంటే ఈ రోగాలకు ఛాన్స్

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకుంటే ఈ రోగాలకు ఛాన్స్

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుండా స్కిప్ చేసే వారిలో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మెదడు చురుకుదనం తగ్గుతుందని ఎప్పుడు మూడు స్వింగ్స్ ఉంటాయని చెబుతున్నారు. హార్మోనల్ సమస్యలు పెరిగి, మైగ్రేన్ సమస్యతో బాధపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రతిరోజు అల్పాహారం తీసుకోకుండా స్కిప్ చేసేవారు మధుమేహం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అనేక రోగాలకు స్వాగతం పలికే ఈ చెడ్డ అలవాటును మార్చుకుంటే మంచిదని, కచ్చితంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+