వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: పాదాలకు నిద్రకు లింక్.. మంచి నిద్రకోసం ఇలా చేసి చూడండి!!

|
Google Oneindia TeluguNews

చాలామంది నిద్రపట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. నిద్రపోవడం కోసం అనేక నిద్రమాత్రలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బాగా నిద్ర పోవాలని భావించేవారు, చక్కని ప్రశాంతమైన నిద్ర కోసం పాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్రకు పాదాలకు సంబంధం ఏమిటి అంటే, చాలా పెద్ద సంబంధం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆ సంబంధాన్ని పక్కనపెడితే పాదాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చక్కని నిద్ర పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

పాదాలకు మర్దనా చేయడం నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది

పాదాలకు మర్దనా చేయడం నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది


నిద్రలేమితో బాధపడేవారు సుఖవంతమైన నిద్ర పోవాలంటే పాదాలకు మర్దనా చేయడం మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో పడుకునే ముందు పాదాలను కాసేపు కొబ్బరినూనెతో కానీ, ఆవ నూనెతో కానీ మర్దన చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది అని చెబుతున్నారు. అంతేకాదు పాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు అని చెబుతున్నారు.

వారంలో మూడు రోజులు పాదాల విషయంలో ఈ పని చేయండి

వారంలో మూడు రోజులు పాదాల విషయంలో ఈ పని చేయండి

పాదాల విషయంలో చేయవలసిందల్లా వారంలో మూడుసార్లు ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులో కాస్త ఉప్పు, దంచిన చిన్న అల్లం చిన్న ముక్క వేసి ఆ నీళ్లల్లో పాదాలను పావుగంట సేపు ఉంచాలి. ఆ తరువాత పాదాలను శుభ్రంగా పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. ఆపై కాళ్లకు, పాదాలకు కొబ్బరి నూనె కాని ఆవనూనె కానీ పట్టించి కాసేపు మర్దన చేయాలి. ఇక ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా సబ్బును ఉపయోగించి కూడదు. ఈ విధంగా పాదాలకు మర్దనా చేస్తే చక్కని నిద్ర సొంతం అవుతుందని చెబుతున్నారు. మరుసటి రోజు హుషారుగా పని చేసుకోగలుగుతాం అని చెబుతున్నారు.

పడుకునే ముందు పదినిమిషాలు పాదాలను మసాజ్ చేసుకోండి

పడుకునే ముందు పదినిమిషాలు పాదాలను మసాజ్ చేసుకోండి


మన శరీరంలోని వివిధ అవయవాలకు పాదాలతో సంబంధం ఉంటుంది. అందుకే పాదం లోని కొన్ని భాగాలపై ఒత్తిడి కలిగిస్తూ మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ప్రతిరోజూ పడుకునేముందు కాసేపు పాదాలను మసాజ్ చేసుకుంటే అవి రక్తప్రసరణను మెరుగుపరిచి చక్కగా నిద్రపోవడానికి కారణమవుతాయి. పాదాలను మసాజ్ చేసుకోవడం వల్ల చాలా వరకూ ఒత్తిడి తగ్గుతుంది.

 ప్రెజర్ పాయింట్స్ తెలుసుకొని మసాజ్ చేస్తే మరీ మంచిది

ప్రెజర్ పాయింట్స్ తెలుసుకొని మసాజ్ చేస్తే మరీ మంచిది

పాదాలలోని ప్రెజర్ పాయింట్స్ ని తెలుసుకొని తదనుగుణంగా మసాజ్ చేసుకోవడం వల్ల బిపి, యాంగ్జైటీ, ఊపిరితిత్తులు, మెదడుకు సంబంధించిన అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజూ పడుకునే ముందు ఒక పది నిమిషాల పాటు గోరువెచ్చని నూనెతో పాదాలను మసాజ్ చేసుకుంటే, నిద్ర ఆటోమేటిక్ గా పడుతుంది. కొన్ని రోజులు దీనిని అలవాటుగా మార్చుకొని చూడండి.. ఆపై రిజల్ట్ మీరే చెప్పండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.


English summary
Need a restful sleep? But try massaging your feet daily. Foot massage reduces stress, improves blood circulation and leads to better sleep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X