health tips: ప్రతీరోజూ 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవటం వలన ఏం జరుగుతుంది?
నిద్ర... మానవ జీవితంలో అతి ముఖ్యమైన భాగం. ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతిరోజు అవసరమైనంత నిద్రపోయిన వారు ఆరోగ్యంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి ఎప్పుడో పడుకుంటారు. వారు కనీసం 7గంటల పాటు కూడా నిద్రపోరు. అయితే దాని ప్రభావం వారి శరీరం పైన పడుతుందనే విషయాన్ని వారు గమనించరు. కానీ ఇది నిజం.
7 గంటల కంటే తక్కువ నిద్రపోతే జరిగేదిదే
ప్రతిరోజు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో రకరకాల సమస్యలు వస్తాయి. శారీరక, మానసిక సమస్యలతో వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో కూడా సమయం దొరకడం లేదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే అతనికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

తక్కువ సమయం నిద్రపోతే ఆరోగ్యానికి హాని
ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 7 గంటల సమయం కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తి వేగంగా బరువు పెరుగుతారు. నిద్ర చక్రంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇవి మానసిక రుగ్మతలకు కూడా కారణమవుతాయి. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల వారిలో ఒత్తిడి, టెన్షన్ పెరుగుతుంది. డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
సరిపోను నిద్రపోతే శరీరం రిపేర్
7 గంటలకంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు ఉదయం తాజా అనుభూతిని చెందరు. శరీరంలో అలసట అలాగే ఉంటుంది. రాత్రి సమయంలో నిద్ర పోయినప్పుడు మన శరీరంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు రిపేర్ చేయబడతాయి. సరిగ్గా నిద్రపోని వారిలో శరీరం రిపేర్ కాదు. ఫలితంగా అనారోగ్యం వస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పోవు.
నిద్రలేమితో వచ్చే రోగాలివే
శరీరంలో విషపదార్థాలు చేరడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతోపాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలసేపు కచ్చితంగా నిద్ర పోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications