ఆ సమస్యలకు చెక్ పెట్టాలంటే హెల్డీ స్నాక్స్ ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే!

ఒబేసిటీ ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఎక్కువగా బరువు పెరగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం మన బరువును పెంచుతుంది అని చాలామంది భావిస్తున్నారు. ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకుంటే బరువును నియంత్రించవచ్చని భావిస్తున్నారు.

హెల్దీ స్నాక్స్ కు పెరుగుతున్న డిమాండ్

ఇటీవల కాలంలో , భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్‌కు డిమాండ్ పెరిగింది. వినియోగదారులు బరువు నిర్వహణకు మద్దతు ఇచ్చే పోషకమైన ఎంపికలను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ ధోరణి జనాభాలో ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న అవగాహనతో వచ్చింది. ఇటీవల కాలంలో ఏదైనా స్నాక్స్ తినాలి అనుకుంటే కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండే స్నాక్స్ ను, తక్కువ క్యాలరీలు ఉండే స్నాక్స్ ను తినడానికి ఇష్టపడుతున్నారు.

healthy-snacking-trends-in-india-to-control-obesity-and-live-healthy

స్నాక్స్ కేవలం పోషకాహారంగా మాత్రమే కాదు టేస్టీ

ముఖ్యంగా మిల్లెట్స్, పప్పులు శనగలు వంటి సాంప్రదాయ పదార్థాలతో తయారు చేసిన స్నాక్స్ ను తింటున్నారు. ఈ స్నాక్స్ కేవలం పోషకాహారంగా మాత్రమే కాకుండా స్థానిక రుచులకు అనుగుణంగా ఉంటున్నాయి. తక్కువ క్యాలరీలు ఉన్న స్నాక్స్ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తున్నాయి. మన శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడంలో, మన ఆకలిని తగ్గించడంలో దోహదం చేస్తున్నాయి.

బరువు కంట్రోల్ చేయటంలో కీలకంగా హెల్డీ స్నాక్స్

ఇది మన బరువుని సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకంగా పనిచేస్తున్నాయి. బేక్ చేసిన కూరగాయల చిప్, మిల్లెట్ లతో తయారు చేసిన బిస్కెట్స్, మిల్లెట్ పఫ్స్, వేయించిన శనగలు మొదలైన ఆహారాలు ఉన్నాయి. ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్ల ఆధారంగా చాలామంది బయట హెల్ది స్నాక్స్ ను తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు.రాబోయే సంవత్సరాలలో ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారీ మార్కెట్ మరింత విస్తరిస్తుంది అని భావిస్తున్నారు.

మిల్లెట్స్ తో తయారు చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ తో బరువుకు చెక్

చాలామంది బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తినే తిండి విషయంలో చూపిస్తున్న శ్రద్ధ కారణంగా బయట స్నాక్స్ తయారీదారులు కూడా వారి డిమాండ్ కు తగిన విధంగా తమ ఉత్పత్తుల లైన్ మారుస్తున్నారు. ఏది ఏమైనా రోజువారీ ఆహారాలలో మిల్లెట్స్ తో తయారు చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+