Health News: యువతలో గుండె పోటు.. ఈ పని చేయండి చాలు..!
ఈ మధ్య గుండె పోట్లు వణికిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పి రావడం అదీ మధ్యలో వస్తే అది గుండె పోటుకు సంకేతమని వైద్యులు చెబుతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె పోటు వస్తున్నాయి. హృద్రోగ సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర కలిగిన వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జన్యుపరంగా
జన్యుపరంగానే యువకులకు గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. దీంతోపాటు జీవనశైలి వల్ల కూడా యువకులు ఎక్కువగా గుండె పోటు బారినపడుతున్నారని చెబుతున్నారు. ఛాతిలో నొప్పి ఉంటే వెంటనే ఈసీజీ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈసీజీలో మనకు స్పష్టంగా తెలియకుంటే 2డీ ఎకో తీసుకోవాలని వివరిస్తున్నారు.
అలవాట్లు
జన్యుపరమై కారణాలతో పాటు అలవాట్లతో కూడా గుండె పోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, దాదాపు 25 శాతం మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు కొన్ని రకాల పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారని.. ధూమపానం వల్ల వచ్చే గుండె జబ్బులతో ఏటా 90,000 మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
కొవ్వు
అలాగే చాలా మంది తాము తీసుకున్న ఆహారాన్ని సరిగా వాడలేకపోతున్నారు. చాలా మంది ఆఫీస్ ల్లో లంచ్ సమయంలో భోజనం చేసి వెంటనే సీట్లో కూర్చుని పని చేస్తారు. సాయంత్రం ఇంటికి వెళ్లి డిన్నర్ చేసిన తర్వాత వెంటనే నిద్ర పోతారు. వారు మెట్లు ఎక్కడానికి బదులుగా లిఫ్ట్ వాడతారు. ఇలా శరీరానికి ఎలాంటి పని చెప్పకపోయేసరికి బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులో చెబుతున్నారు.












Click it and Unblock the Notifications