ఈ టీని రోజుకు ఒక్కసారి తాగండి.. తర్వాత

ప్రస్తుత రోజుల్లో మారిన ఆహారపు అలవాట్లవల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే చిన్న తలనొప్పి అనిపించగానే చాలామంది వెంటనే ఒక టీ తాగేస్తారు. అలా కాకుండా హెర్బల్ టీని తాగితే అనేకరకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అందులో మందారంతో తయారయ్యే టీవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దాన్నిగురించి తెలుసుకుందాం.

కావల్సినవి: మందారపువ్వు, అర్జున బెరడు, బెల్లంపొడి, నల్ల మిరియాలు, యాలకులు
ఎలా చేయాలంటే: ఒక మందార పువ్వు, మూడు గ్రాముల బెరడు పొడి, ఒక టీ స్పూన్ నల్లమిరియాల పొడి, 1 గ్రాము శొంఠి పొడి, 1 గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు అయ్యేవరకు మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది. దీన్ని 12 వారాలపాటు కచ్చితంగా తీసుకుంటుంటే బీపీ లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

hibiscus herbal tea health benefits and uses

మందారపువ్వును వాడటంవల్ల మధుమేహం, తలనొప్పి, ఆందోళన, కలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడం, హార్మోన్ల సమస్యలు, హైబీపీ, స్కిన్ సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలోని కఫ, పిత్త దోషాన్ని సమతూకం చేస్తాయి. మందార పువ్వు మనసును ప్రశాంతంగా ఉంచేలా చూస్తుంది. మనసును తేలికగా చేస్తుంది. మందారపువ్వులో ప్రత్యేక గుణాలుంటాయి.

ఇవి శరీరంలోని పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక్కసారైన మందారపువ్వు టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+