వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TB: టీబీ ఎలా వస్తుంది.. వస్తే ఏం చేయాలి.. వైద్యులు ఏం చెబుతున్నారు..

|
Google Oneindia TeluguNews

దేశంలో సైలెంట్ గా టీబీ విస్తరిస్తోంది. క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారత్ లోనే ఉన్నారట. దీన్ని అస్సలే లైట్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఈ టీబీ ఒక‌ప్పుడు ప్ర‌పంచాన్ని వణికించింది.మైకోబ్యాక్టీరియం ట్యూబ‌ర్‌క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా కార‌ణంగా టీబీ వ‌స్తుంది. ఇది ప్ర‌ధానంగా ఊపిరితిత్తుల‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే కాకుండా ఒక్కోసారి మూత్ర‌పిండాలు, వెన్నెముక‌, మెద‌డు, గ‌ర్భాశం వంటి కీల‌క అవ‌య‌వాల‌ను కూడా దెబ్బతీస్తుంది.

ప్రతి సెకనుకు ఒకరికి

ప్రతి సెకనుకు ఒకరికి

దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ వ్యాధి వస్తోందట. రోజూ దేశంలో 1000 మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒక్క తెలంగాణలోనే 72,674 టీబీ కేసులు ఉన్నాయి. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌హ‌మ్మారిపై 2030 నాటికి విజ‌యం సాధించాల‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో ) కూడా ల‌క్ష్యాన్ని పెట్టుకుంది.ఈ వ్యాధిపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌తి ఏటా మార్చి 24న ప్ర‌పంచ క్ష‌య వ్యాధి దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ట్యూబ‌ర్‌క్యూలోసిస్

ట్యూబ‌ర్‌క్యూలోసిస్

మైకోబ్యాక్టీరియం ట్యూబ‌ర్‌క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఇత‌రుల‌కు సోకుతుంది. టీబీ వచ్చిన వారికి విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం వస్తుంది. ఛాతిలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తుండటం , రాత్రి వేళలో చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఏళ్ల తరబడి

ఏళ్ల తరబడి

టీబీ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో బ్యాక్టీరియా సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపిస్తాియ. మరికొందరిలో ఏళ్ల తరబడి బాక్టీరియా ఉండిపోయి, ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ, వ్యాధి సోకిన రెండు నుంచి ఐదేండ్ల‌ లోపు వ్యాధి లక్షణాలు
పెరుగుతాయిట.

తెమడ పరీక్ష

తెమడ పరీక్ష

టీబీ నిర్ధారణ కోసం తెమడ పరీక్ష చేస్తారు. ఛాతి ఎక్స్-రే, ల్యాటెంట్ టీబీ విషయంలో కొన్నిసార్లు చర్మం పరీక్ష, దేహంలో టీబీ సూక్ష్మక్రిమిని నిర్ధారణ చేసే న్యూర‌లాజికల్ పరీక్షలు కూడా చేస్తారు. హెచ్‌ఐవీ పేషెంట్లు, డయాబెటిస్ మెల్లిటస్, పోషకాహార లోపం ఉన్నవారిలో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో, కిడ్నీ మార్పిడి తర్వాత, కరోనా వైరస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న రోగులు, క్యాన్సర్ కీమోథెరపీలో ఉన్న రోగులకు టీబీ ఎక్కువగా సోకుతోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

కనీసం 6 నెలలు

కనీసం 6 నెలలు

టీబీకి సరైన చికిత్స అందుబాటులోకి వచ్చింది క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. కొన్ని రోజులు మందులు వాడగానే లక్షణాలు త‌గ్గిపోయాయ‌ని మందులు వాడ‌టం ఆపేస్తుంటారు. వారిలో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. ఇలాంటి వారికి ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. టీబీ కోర్సు కనీసం 6 నెలలు వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

English summary
TB is spreading silently in the country. Tuberculosis patients are mostly in India. Doctors say not to take it lightly at all. This TB once shook the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X