పానీపూరీ తిన్న వ్యక్తికి ప్రాణాంతక వ్యాధి.. కాళ్లు, చేతులు పచ్చగా.. నెల రోజులు ఆస్పత్రి బెడ్ పైనే..!
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్ లో ప్రశాతంగా ఇంట్లో వంట చేసుకుని తినే భాగ్యం లేకపోయింది. ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగాల టైమింగ్ దృష్ట్యా టైమ్ లేక చాలామంది బయటే తినేస్తున్నారు. ఈ క్రమంలో మహానగరంలోని ఫాస్ట్ఫుడ్స్, హోటల్స్, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైమ్ లో చూసినా రద్దీగానే ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం కల్తీ ఆహారాలకు అడ్డాగా హైదరాబాద్ మారుతోంది. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లాభాల కోసం దందా నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ తో పాటుగా ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసినా ఫుడ్ ట్రక్ లు, తోపుడు బండ్లు, హోటల్స్, రెస్టారెంట్లు ఇమ్మడిముమ్మడిగా పెరిగిపోతున్నాయి. వాటిలో తినే ఆహారం రంగురంగులతో కనిపిస్తూ నోరూరిస్తున్న కారణంగా ప్రజలు వాటిని ఇష్టంగా తింటున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ 22 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగి పానీపూరీ తిని నెల రోజులు ఆస్పత్రిపాలయ్యాడు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి డాక్టర్లు సకాలంలో చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు.

ఈ ఘటనపై ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ఓ యువకుడు తమ దగ్గరికి వచ్చాడని.. అతడి కళ్లు, చర్మం పసుపురంగులో మారిపోయింది. కామెర్లు వచ్చాయి. కడుపులో నొప్పి, వాంతులతోపాటు నీరసంగా ఉన్నాడు. మూత్రం ముదురు రంగులో ఉండటం కారణాలు చెప్పాడు. రక్తపరీక్షలు చేస్తే హెపటైటిస్ ఎ తీవ్రంగా ఉందని, దాంతో పాటే కాలేయంలోని ఎంజైమ్ లు పెరిగాయని, యాంటీ-హెచ్ ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ గా ఉన్నాయని తేలిందని తెలిపారు. నాలుగు వారాలకు అతడి లివర్ మెరుగుపడి పూర్తిగా కోలుకున్నాడని వివరించారు. బయటి ఫుడ్ ఎంత ప్రమాదకరమైనదో ఈ ఘటన వివరిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications