కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా.. ఇది తెలుసుకోండి!
అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కావాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ మన చర్మం అందంగా ఉండాలని అనుకుంటారు. అందమైన చర్మాన్ని సొంతం చేసుకుని మెరుస్తూ ఉండాలని కలలు కంటారు ముఖ్యంగా మహిళలు అయితే కొరియన్ గ్లాస్ స్కిన్ లా మెరిసిపోయే స్కిన్ కావాలని భావిస్తారు. ఇక అటువంటివారు ప్రకాశవంతమైన స్కిన్ కావాలంటే ఏం చేయాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే జీవన శైలి ముఖ్యం
కొరియన్ గ్లాస్ స్కిన్.. ఇది లోపల నుండి ప్రకాశించే స్పష్టమైన మరియు చాలా హైడ్రేటెడ్ గా ఉండే చర్మం. ఇది మన అందాన్ని మరింత పెంచుతుంది. ఇటీవల కాలంలో కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అమ్మాయిలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే జీవన శైలి కూడా చాలా ముఖ్యమని బ్యూటీషియన్లు చెబుతున్నారు.

ఇలా చేస్తే కొరియన్ గ్లాస్ స్కిన్
అన్నిటికంటే ముందు మంచినీళ్ళను తగినంతగా తాగాలని ఇది మన చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, చర్మాన్ని తేమగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.
బియ్యం పిండితో ఇలా చేస్తే చర్మ నిగారింపు
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అందంగా మెరిసిపోవాలంటే తగినంత నిద్ర కూడా అవసరమని సూచిస్తున్నారు. ఇక స్కిన్ డీహైడ్రేట్ కాకుండా వారానికి రెండుసార్లు హైడ్రేటింగ్ షీట్ మాస్క్ ను ఉపయోగించడం మీ స్కిన్ కు అదనపు మెరుపు నిస్తుందని చెబుతున్నారు. మనం ఇంట్లోనే ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, కొరియన్ గ్లాస్ స్కిన్ లాంటి లుక్కు పొందడానికి బియ్యం పిండి సహజమైన ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుందని, ఇది మన చర్మానికి కావలసిన నిగారింపును ఇస్తుందని చెబుతున్నారు.
బియ్యం పిండి ఫేస్ ప్యాక్ తో కొరియన్ గ్లాస్ స్కిన్
బియ్యం పిండిలో పాలు కానీ పెరుగు కానీ కలిపి దాంతో ఫేస్ ప్యాక్ వేస్తే ఇది చర్మాన్ని కాంతివంతం చేసే మృదువుగా ఉండేలా చేస్తుందని చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించే సహజసిద్దమైన మెరుపును తెస్తాయని చెబుతున్నారు. కాబట్టి కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే ముందు ఇంట్లోనే సహజ పద్ధతులను ఫాలో అవ్వండి. బ్యూటీ పార్లర్ల వెంట పరిగెత్తడం మానేయండి.












Click it and Unblock the Notifications