Cough Syrup: మీ పిల్లలకు కాఫ్ సిరప్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..!

ఓ తల్లి తన కూతురుకు ఫోన్ చేసింది. పిల్లలు ఎలా ఉన్నారమ్మ అని అడిగింది. పిల్లలు దగ్గు వస్తుంది అమ్మ అని కూతురు సమాధానం ఇచ్చింది. దానికి తల్లి దగ్గు టానిక్ వాడాలని చెప్పింది. వీరే కాదు ఎవరైన దగ్గు వస్తుంటే కాఫ్ సిరప్ వాడమని చెబుతారు. కానీ పిల్లలకు దగ్గు రాగానే దగ్గు టానిక్ వాడడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

ముంబయి

ముంబయి


కొద్ది రోజుల క్రితం ముంబయిలో ఒక రెండున్నరేళ్ల చిన్నారికి దగ్గు మందు తాగించిన తర్వాత 17 నిమిషాల పాటు నాడి కొట్టుకోవడం (పల్స్) ఆగిపోయిందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల్లో తల్లి నుంచి వచ్చిన రోగ నిరోధక శక్తి అయిదేళ్లకు తగ్గిపోతుందని, అప్పటిలోగా స్వయంగా రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెంది ఉండకపోవడం వల్ల పిల్లలకు అలర్జీలు, వైరల్ జ్వరాలు బారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు.

నిషేధం

నిషేధం

సాధారణంగా పిల్లల్లో దగ్గు వెంటనే తగ్గదట. మూడు నాలుగు రోజులు పెరిగి తరువాత క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రీక్వెంట్‌గా నీరు ఎక్కువగా తాగిస్తే దగ్గు తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుల వద్ద వెళ్లాలి. సొంతంగా మెడిసిన్ వాడకూడదట. కాగా గత ఆక్టోబర్ లో భారత్‌లో తయారైన నాలుగు రకాల కాఫ్ సిరప్‌లపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిషేధం విధించింది.

66 మంది చిన్నారులు మృతి

66 మంది చిన్నారులు మృతి

పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియా అనే దేశంలో 66 మంది చిన్నారులు మృతి చెందగా.. వారి మృతికి ఈ నాలుగు రకాల కాఫ్ సిరప్‌ల వినియోగంతో సంబంధం ఉందని తేలింది. ఈ కారణంగానే ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు కాఫ్ సిరప్‌లపై నిషేధం విధించినట్లు తేలుస్తోంది.నిషేధం విధించిన నాలుగు దగ్గు సిరప్‌లలో ప్రోమెతజైన్ ఓరల్ సొల్యుషన్, కొఫెక్సామలిన్ బేబీ కాఫ్ సిరప్, మకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఉన్నాయి

మెయిడెన్ ఫార్మాసుటికల్స్

మెయిడెన్ ఫార్మాసుటికల్స్

హర్యానాలోని మెయిడెన్ ఫార్మాసుటికల్స్ లిమిటిడ్ అనే ఫార్మాసుటికల్ కంపెనీ ఈ నాలుగు కాఫ్ సిరప్‌లను తయారు చేస్తోంది. డైతిలిన్ గ్లైకాల్ లేదా ఇతిలిన్ గ్లైకాల్.. ఈ రెండు కూడా మానవ శరీరానికి ప్రమాదకరమే. వీటిని ఉపయోగించినప్పుడు కిడ్నీ, నరాల పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఉజ్బెకిస్థాన్‌

ఉజ్బెకిస్థాన్‌

భారత్‌కు చెందిన సంస్థ తయారు చేసిన కాఫ్ సిరప్ కారణంగా చిన్నారులు మరణించారంటూ ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై వెంటనే కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. నోయిడాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ ఈ సిరప్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీల మందుల తయారీ నిషేధించారు.

పెద్దలకు కూడా..

పెద్దలకు కూడా..

కాఫ్ సిరప్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ప్రమాదకమేనట.. అందుకే ఎక్కువగా కాఫ్ సిరప్ వాడొద్దని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే కాఫ్ సిరఫ్ లో ఉండే మూలకాలు శరీరంపై ప్రభావాన్ని చూపుతాయట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+