భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..??
పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఈ వారంలో 11 శాతం మేర క్షీణించాయి. మార్చి 6 తర్వాత ముడి చమురు ధర బ్యారెల్ కు 100 డాలర్లకు పడిపోవడం ఇదే తొలిసారి. భారతీయ రిఫైనరీల ముడి చమురు బాస్కెట్ ధర శుక్రవారం నాటికి బ్యారెల్ కు 97.52 డాలర్లకు పడిపోయింది. అలాగే బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 91. 12 డాలర్లకు చేరింది.
అయితే ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. భారత్ లో ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా..? అంటే అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపై రోజుకు ఇంకా రూ. 550 కోట్ల మేర నష్టాలను చవిచూస్తున్నాయి. దీనికి తోడు అమెరికన్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత చమురు సంస్థలు భారీగా పెరగడంతో ఇటీవల భారత్ లో పెట్రోల్ ధరను లీటర్ కు సుమారు రూ.7.5, సీఎన్జీని రూ. 6 చొప్పున పెంచారు. జూన్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ గెయిన్స్ పన్ను సగానికి(లీటర్ కు రూ. 1.5) తగ్గించింది. అలాగే డీజిల్ పై రూ. 13.5, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) పై రూ. 9.5 కు తగ్గించింది.

ఇక ఇరాన్ యుద్ధం కారణంగా కెమికల్స్, ముడి పదార్థాలు ధరలు 300 శాతం పెరిగాయి. ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు కూడా ఎక్కువవడంతో రక్షణ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్ విభాగాలు భారత్ లో 384 రకాల అవసరమైన మందుల ధరలను ఒకేసారి పెంచేందుకు చర్చలు నిర్వహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications