వైయస్సార్ విగ్రహం తలతీసిన దారుణం: జగన్ పై లోకేష్ ఫైర్, షర్మిల అల్టిమేటం!

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కేంద్రంలో ఊహించని ఘటన రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపింది. జంబులయ్య అనే వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి, దాని తలభాగాన్ని వేరు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్అయింది.

నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం తలభాగం వేరు చేసిన వ్యక్తి.. వైసీపీ ఆందోళన

ఎవరు అలా చెయ్యవద్దని చెప్పినా వినకుండా జంబులయ్య అనే వ్యక్తి వైఎస్సార్ విగ్రహ తల భాగాన్ని వేరు చేయటం నంద్యాలలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఈ దారుణానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

YSR Statue vandalism created political row in ap lokesh slams ys jagan sharmila gave ultimatum

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా జంబులయ్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ పని చేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అతని మానసిక స్థితి బాలేదని కూడా చెప్తున్నారు. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ నాయకుల అనుచరుడి పనే అన్న మంత్రి లోకేష్

విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీ నాయకుల అనుచరుడేనని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ తన పార్టీ కార్యకర్తలతో ఇలాంటి నాటకాలు ఆడిస్తున్నారని ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు జంబులయ్యను అరెస్ట్ చేసి కేసు విచారిస్తున్నారు.

బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే భక్తులకు కీలక అలెర్ట్.. వాటిపై నిషేధం!
బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే భక్తులకు కీలక అలెర్ట్.. వాటిపై నిషేధం!

ఆమరణ దీక్షకు దిగుతానన్న వైఎస్ షర్మిల

మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడి రాజకీయ కక్ష సాధింపులకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. పట్టపగలు విగ్రహంపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే పాత విగ్రహం ఉన్న చోట కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో తాను నంద్యాల శ్రీనివాస సెంటర్ లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+