తులారాశి, వృశ్చికరాశి వారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులా రాశి శుక్రుడి ఆధీనంలో ఉంటుంది. వృశ్చిక రాశి కుజుడి ఆధీనంలో ఉంటుంది. రెండు పూర్తిగా భిన్నమైన శక్తులు, తత్వాలు కలిగిన రాశులు ఇవి. తులా రాశి వారు వాయు తత్వానికి, వృశ్చిక రాశి వారు జల తత్వానికి చెందుతారు. ఈ రెండు రాశుల వారికి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి, కెరీర్, ఆర్థిక, కుటుంబ విషయాల్లో బాగా కలిసిరావడానికి జ్యోతిష్య నిపుణులు సూచించే కొన్ని సులభమైన పరిహారాలను తెలుసుకుందాం.
తులా రాశి
తులా రాశికి అధిపతి శుక్ర గ్రహం. ఈ రాశి వారు సమాజంలో గౌరవాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరికి అదృష్టం కలిసిరావాలంటే శుక్రుడి అనుగ్రహం చాలా అవసరం. ప్రతిరోజూ లేదా కనీసం శుక్రవారం నాడు లక్ష్మీ దేవి పూజ చేయడం, 'శ్రీ సూక్తం' లేదా 'లక్ష్మీ అష్టోత్తరం' పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రుడికి అలంకరణ, సువాసనలు అంటే ఇష్టం. కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రమైన, ఉతికిన దుస్తులు ధరించడం, మైల్డ్ పర్ఫ్యూమ్స్ వాడటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు తెలుపు, లేత నీలం క్రీమ్ రంగు దుస్తులు ధరిస్తే పనులు సులువుగా పూర్తవుతాయి. శుక్రవారం రోజున ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం లేదా పేదలకు పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల శుక్ర దోషాలు తొలగుతాయి.













Click it and Unblock the Notifications