షుగర్ కంట్రోల్ లో లేకుంటే చర్మంపై ఈ సంకేతాలు.. జాగ్రత్త
డయాబెటిస్ మన జీవితాన్ని డేంజర్ జోన్ లోకి నెడుతుంది. ఇప్పుడు సమాజంలో జీవన విధానం కారణంగా చాలామంది షుగర్ బాధితులుగా మారుతున్నారు. రక్తంలో అధిక చక్కెర (హై బ్లడ్ షుగర్) సమస్య శరీరంలో ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. నియంత్రణలేని మధుమేహం మెడ, ముఖం, పాదాలు వంటి భాగాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది.
డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే చర్మ ఆరోగ్య భంగం
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలీకుండానే చిన్న రక్తనాళాలు, నరాలకు నష్టం జరుగుతుంది. ఈ నష్టం మొదటగా చర్మం పై పొరలపై కనిపిస్తుంది. చర్మ సమస్యలు డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో వేడి, తేమ కారణంగా ఈ సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. కుటుంబ చరిత్ర ఉన్నవారు లేదా స్థూలకాయం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పొడిబారిన, పగిలిపోయిన చర్మం.. కంట్రోల్ లో లేని డయాబెటిస్ సంకేతం
డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే పొడిబారిన చర్మం ఒక సమస్యగా మారుతుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు, మోచేతులు గరుకుగా మారి దురద పెరుగుతుంది. చర్మం పగుళ్లు రావడం కూడా సాధారణంగా జరుగుతుంది. అధిక చక్కెర శరీర కణజాలాల నుంచి ద్రవాన్ని లాగడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. మాయిశ్చరైజర్ వాడినా ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది.
మెడతో పాటు ఆ భాగాలలో నల్లని మచ్చలు
మెడ, చంకలు, గజ్జల వద్ద నలుపు రంగు, నల్లని మచ్చలు కనిపిస్తే అది 'అకాంథోసిస్ నైగ్రికన్స్’ కావచ్చు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు ప్రధాన సూచన. చాలామంది మొదట మెడ మడతల వద్ద ఈ మార్పును గమనిస్తారు. నెమ్మదిగా మానని గాయాలు మరో ప్రమాదకర సంకేతం. పాదాలపై చిన్న గాయాలు, కోతలు వారాల తరబడి మానకపోతే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అలాగే తరచూ స్కిన్, ఫంగల్ లేదా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు రావడం కూడా అధిక చక్కెర స్థాయిలను సూచిస్తుంది.
చిన్న చర్మ మార్పులు కనిపించినా నిర్లక్ష్యం చెయ్యొద్దు
కొంతమందికి కాళ్ల దిగువ భాగంలో లేత గోధుమ రంగు గుండ్రని మచ్చలు) కనిపిస్తాయి. ఇవి నొప్పి లేకపోయినా రక్తనాళాల నష్టానికి సూచికలు.వైద్యులు ఇంట్లోనే పాదాలు, మెడ రంగు, కొత్త దద్దుర్లను, మచ్చలను తరచూ గమనించాలని సూచిస్తున్నారు. రెండు వారాలకు మించి మార్పులు కొనసాగితే నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలి.












Click it and Unblock the Notifications