ప్రతిరోజూ ఈ లడ్డూ గానీ తింటున్నారా- తయారీ విధానం ఈజీ
శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది ఎనర్జీని అందించడమే కాకుండా, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. కొందరు ఖరీదైన ప్రోటీన్ పౌడర్లను వాడి కండరాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంట్లోనే ప్రోటీన్ లడ్డూలను తయారుచేసుకుని తినడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కూడా. ఈ లడ్డూలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.
రోజువారీ పనుల్లో బిజీగా ఉంటూ, సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. కావాల్సినంత ప్రొటీన్లు అందవు. దీని దుష్ప్రభావం ఇప్పటికిప్పుడు కనిపించకపోయినా..దీర్ఘకాలంలో దెబ్బతింటుంది. ఏ చిన్న పని చేసిన శరీరం త్వరగా అలసిపోవాల్సిన దశకు చేరుకుంటుంది.

ఆ పరిస్థితి రాకుండా ముందుగానే నివారించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇంట్లోనే లడ్డూల రూపంలో ప్రొటీన్లను తీసుకోవచ్చు. ఈ లడ్డూలు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లతో నిండి ఉంటాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఈ లడ్డూలు తయారుచేయడానికి కావలసిన పదార్థాలు..
ఒక కప్పు వేయించిన వేరుశెనగలు
అర కప్పు వేయించిన పప్పులు (శనగలు)
అర కప్పు బాదం
పావు కప్పు గుమ్మడి గింజలు
పావు కప్పు గింజలు లేని ఖర్జూరాలు
రెండు చెంచాల కరిగించిన బెల్లం
ఒక చెంచా నెయ్యి
పావు చెంచా యాలకుల పొడి.
తయారీ విధానం..
ముందుగా వేరుశెనగ, శనగలు, బాదం, గుమ్మడి గింజలను వేయించుకోవాలి. అవి చల్లబడిన తర్వాత, మిక్సర్‌లో వేసి మెత్తగా పొడి చేయాలి. తర్వాత, ఖర్జూరాలను 10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టి, మిక్సర్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
ఒక గిన్నెలో పొడి చేసిన మిశ్రమం, ఖర్జూరం పేస్ట్, కరిగించిన బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నెయ్యి జోడించి చిన్న లడ్డూలను తయారు చేసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తర్వాత లేదా సాయంత్రం ఒక లడ్డూ తినాలి. దీనిని పాలతో కూడా తీసుకోవచ్చు. ఈ లడ్డూలు పిల్లలకు, పెద్దలకు కూడా ప్రయోజనకరమైనవి. బలహీనమైన శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడానికి ఇవి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు బెల్లం పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. వేరుశెనగకు బదులుగా బాదం అయినా ఉపయోగించవచ్చు.












Click it and Unblock the Notifications