sleeping crisis: భారతీయులకు నిద్ర కరువైంది!

మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు నిద్ర ఎంతో అవసరం. అయితే, ఇటీవల పెరిగిపోయిన యాంత్రాకి జీవనంలో మనిషికి నిద్ర కరవవుతోంది. భారతీయులు నిద్రకు కావాల్సినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తాజాగా ఓ సర్వే తేల్చింది. దీంతో నిద్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకున్నాయని గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికలో వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా 13 దేశాల్లో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది గ్లోబల్ స్లీప్ సర్వే సంస్థ. ఈ సర్వేలో భారతీయుల నిద్రకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. భారతీయులు ప్రతీవారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో తేలింది. చాలా మంది ఈ సమస్యతో పోడుతున్నప్పటికీ.. ఎలాంటి వైద్య సహాయం తీసుకోవడం లేదని తెలిపింది. అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారని తేల్చింది.

Indians are not sleeping properly Global Sleep Survey

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగరిలో ఒకరు అంటే 22 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని సర్వే తెలిపింది. ఈ నిద్రలేమి సమస్య వ్యక్తుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వెల్లడించింది. పనికి అంతరాయం కలగిస్తోంది. మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తోంది. భారతీయుల్లో 49 శాతం మంది వారానికి కనీసం మూడు రోజులు నిద్రపోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు గ్లోబల్ స్లీప్ సంస్థ వెల్లడించింది.

పురుషులు(41.92శాతం)తో పోలిస్తే మహిళలు (58 శాతం) నిద్రలేమిపై ముందస్తు చర్యలు తీసుకొంటున్నారని సర్వే పేర్కొంది. నిద్రలేమీ అటు ఆఫీసులో పనితీరు, ఇటు కుటుంబ జీవితంపైనా తీవ్రంగా ప్రభావం చేస్తోంది. 47 శాతం మంది భారతీయులు నిద్రలేమి కారణంగా వచ్చే అలసట కారణంగా తమ కెరీర్‌లో ఒక్కసారైనా సిక్ లీవ్ తీసుకుంటున్నారు.

37 శాతం మంది రాత్రి 9 గంటల తర్వాత రాత్రి షిప్టులలో పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇది సహజ నిద్ర చక్రాన్ని ప్రభావితం చేస్తోందని పేర్కొంది. పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ నాణ్యమైన నిద్రను అనుభవిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు వారంలో తక్కువ రాత్రులు మంచి నిద్రను అనుభవిస్తున్నారు. స్త్రీల రుతుచక్రంపై నిద్ర తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని సర్వే వెల్లడించింది.

భారతదేశంలో నిద్రలేమి కారణంగా పురుషుల (12 శాతం)తో పోలిస్తే స్త్రీలు (17 శాతం) సిక్ లీవ్ లు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. యూఎస్, చైనా, భారత్‌లలో 5 వేల మంది వ్యక్తుల చొప్పున సర్వే చేసింది. యుకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, థాయ్ లాండ్, న్యూజిలాండ్, సింగపూర్, హాంకాంగ్ లలో మొత్తంగా 30,026 మందిపై అధ్యయనం చేసింది. కాగా, శరీరానికి మంచి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+