డయాబెటిస్ పేషెంట్స్ వేసవిలో ఈ పండ్లు తింటే మంచిది!!
డయాబెటిస్ పేషెంట్లు మన సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇక డయాబెటిస్ బారిన పడినవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
డయాబెటిస్ బాధితులకు ఈ పండ్లతో మేలు
డయాబెటిస్ పేషంట్స్ పండ్లు తినడం మంచిదే కానీ అన్ని రకాల పండ్లను తినకూడదు. ఒకవేళ పండ్లను తిన్నా కూడా పరిమిత మోతాదులోనే తినాలి. ఇక వేసవి కాలంలో కొన్ని రకాల పండ్లు తినడం డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది. మరి ఆ పండ్లు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

జామ పండు
డయాబెటిస్ పేషంట్స్ జామపండు ఎక్కువగా తినడం మంచిది. జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. జామ పండు రక్తంలోని చక్కెరను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.
పుచ్చకాయ
వేసవి కాలంలో మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవడం కోసం పుచ్చకాయ మంచి ఆహారంగా చెప్పవచ్చు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయినా పుచ్చకాయను పరిమిత మోతాదులోనే డయాబెటిస్ పేషెంట్స్ తినాలి.
యాపిల్ పండు
యాపిల్ పండులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువ ఆకలి కాకుండా నిరోధిస్తుంది. చక్కెర శోషణ ను తగ్గిస్తుంది. మన ఇన్సులిన్ ఆక్టివిటీ ని మెరుగుపరుస్తుంది. కనుక యాపిల్ పండును ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి పండు
బొప్పాయి పండులో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గొప్ప గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది మన ఆకలిని నియంత్రి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి బొప్పాయి డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ముఖ్యంగా ఈ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ వేసవికాలంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications