Health: అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా..!
నీరు తాగడం శరీరానికి ఎంతో మంచిది. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం మంచిదని చెబుతున్నారు. అయితే నీరు ఎప్పుడు పడితే అప్పుడు తాగొచ్చా.. ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగొచ్చా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆహారం తినేటప్పుడు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకునే అరగంట ముందు.. తిన్న అరగంట తర్వాత నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహారం తినేటప్పుడు నీరు తాగకూడదని చెబుతున్నారు.
ఆహారం తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగితే తిన్న ఫుడ్ త్వరగా జీర్ణం కాదని చెబుతున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే నీటి తీసుకోవడం వల్ల జీర్ణరసాలు పలుచగా మారి జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తిన్న తర్వాత ఆహారం జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆ లోపల నీరు తాగినట్లు జీర్ణప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఈ క్రమంలో కడుపు ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫుడ్ తీసుకున్న వెంటనే నీరు తాగకూడదని వివరిస్తున్నారు.

ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగడం వల్ల ఫుడ్ సరిగా జీర్ణం కాదు. కొంత జీర్ణం కాకుండా మిగిలిపోతుంది. ఇది కొవ్వు రూపంలో నిల్వ అవుతుంది. ఆ తర్వాత ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఈ క్రమంలోనే శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో షుగర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆహారం తీసుకునే అరగంట ముందు, ఫుడ్ తీసుకునేటప్పుడు, ఆహారం తీసుకున్న అరగంట తర్వాత నీరు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు లేదా మామూలు నీరు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. అయితే నీటి మరి చల్లగా ఉన్నప్పుడు తాగకూడదు. కొంత మంది చిల్ వాటర్ ఇష్టపడతారు. కానీ ఇలా చేయడం శరీరానికి మంచిది కాదు. మరి ఎక్కువ చల్లగా ఉన్న నీరును తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో టాక్సిన్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే కొంత మంది తాము ఆహారం తినేటప్పుడు నీరు తాగుతాను కానీ ఎలాంటి ఇబ్బంది రాలేదని చెబుతున్నారు. అయితే ఇది శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది.
Note: ఈ వార్త కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. దీనికి వన్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదు.












Click it and Unblock the Notifications