గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!!
నిమ్మరసంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే చాలా మంది ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడానికి ఇష్టపడతారు. ఉదయం పరగగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగటం వలన రీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కానీ నిమ్మకాయ నీళ్లను తాగే వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎన్ని సార్లు తాగాలి.. ఎంత మోతాదులో తాగాలి వంటి విషయాలతో ఎవరికి ఇది సమస్యగా మారుతుందనేది స్పష్టత ఇస్తున్నారు.
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువును తగ్గించడం కోసం ఈ నీళ్లు ఎంతగానో పనిచేస్తాయి. అయితే కొందరు ఈ నీటిలో తేనెకు బదులుగా చక్కెర కలిపి తాగుతుంటారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ నిమ్మకాయ నీళ్లలో చక్కెర కలపకూడదు. ఉప్పును కూడా కలపకూడదు. ఎండవల్ల మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడితేనే అలాంటి సందర్భంలోనే నిమ్మకాయ నీళ్లలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. రోజుకు 1 లేదా 2 సార్లు తాగాలని మాత్రమే నియమం పెట్టుకోవాలి. అన్నే సార్లు తాగాలి. లేదంటే శరీరంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. నిమ్మకాయ నీళ్లను తయారు చేసేందుకు ఉపయోగించే నీళ్లు చాలా శుభ్రంగా ఉండాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయ నీరు తాగడం ద్వారా శరీర హైడ్రేషన్ బాగా ఉంటుంది. పరగడుపున తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. ఇది రోజంతా తీసుకునే ఆహారాన్ని జీర్ణ చేయడంలో సహాయపడుతుంది.

పరిమితి మేరకు తీసుకోవటంతో ప్రయోజనాలు
ఇలా రోజూ నిమ్మకాయం నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగటంతో పాటు శరీరం హైడ్రేటెడ్ అవుతుంది. బరువు కూడా తగ్గడానికి అది సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పి కొందరు నేరుగా నిమ్మరసాన్ని సేవిస్తుూ ఉంటారు. ఇలా చేయటం సరైన విధానం కాదు. నిమ్మకాయ రసంలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి దంతాలకు నేరుగా తాకితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దీంతో దంతాలు బలహీనంగా మారుతాయి. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారు ఈ నీళ్లను ఎట్టి పరిస్థితిలోనూ పరగడుపున సేవించకూడదు. ఈ నీళ్లను తాగాలని భావిస్తే ఉదయం అల్పాహారం చేసిన తరువాత 40 నిమిషాలు ఆగి ఆ తరువాత తాగవచ్చు. ఆహారం తింటానికి ముందు లేదా తిన్న వెంటనే కూడా ఈ నీళ్లను సేవించకూడదు. లేదంటే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఇలా నిమ్మకాయ నీళ్లను తాగే విషయంలో పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఈ నీళ్లతో ప్రయోజనాలను పొందవచ్చు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ - రెండింటిలో వేసవిలో ఏది బెస్ట్..!! -
ఇరాన్ పై అణుదాడికి గ్రీన్ సిగ్నల్ ? ఐరాసకు కీలక అధికారి గుడ్ బై..! -
హార్ముజ్ సంగతి తర్వాత-యుద్దం ముగించేద్దాం..! ట్రంప్ మరో షాక్ ..! -
ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ? -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?













Click it and Unblock the Notifications