ఈ నాలుగు పదార్ధాలతో మసాలా టీ అద్భుతం.. ట్రై చెయ్యండి!
మనలో ఎక్కువ మందికి నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే లోపు కనీసం రెండు సార్లు అయినా టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఎక్కువగా టీ తాగటం ఆరోగ్యానికి హాని చేస్తుంది. అయితే నాలుగు రకాల మసాలాలతో మనం మసాలా చాయ్ చేసుకుని తాగితే మనకు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది.
ఆరోగ్యానికి మేలు చేసే మసాలా చాయ్
చాలా సింపుల్ గా, రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే మసాలా చాయ్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం. జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు తగ్గడానికి, శరీరాన్ని వేడి చేయడానికి ఈ మసాలా చాయ్ బాగా పనిచేస్తుంది. ఎలా తయారు చెయ్యాలో ఒకసారి తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
నీళ్లు - 1½ కప్పు
పాలు - 1 కప్పు (ఐచ్ఛికం, లేకపోతే నీళ్లతోనే చేసుకోవచ్చు)
టీ పొడి / టీ డస్ట్ - 1 టీస్పూన్
శొంటి (పచ్చి లేదా పొడి) - 1 అంగుళం ముక్క లేదా ½ టీస్పూన్ పొడి
మిరియాలు - 4-5 గింజలు (కొద్దిగా దంచి)
యాలుకలు - 2-3 కొద్దిగా దంచి
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
పంచదార / బెల్లం - రుచికి తగ్గట్టు
చేసే విధానం:
ఒక ప్యాన్‌లో నీళ్లు పోసి మరిగించండి. మరిగిన నీళ్లలో శొంటి, మిరియాలు, యాలుకలు, దాల్చిన చెక్క దంచిన పొడిని వేసి 2-3 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు టీ పొడి వేసి మరో 1-2 నిమిషాలు మరిగించండి.పాలు పోసి మళ్లీ ఒకసారి మరిగించండి. ఆపై బెల్లం వేసి బాగా కలిపి దించేయండి. జల్లెడతో వడకట్టి హాట్‌గా సేవించండి.ఈ మసాలా టీ మనకు టీ తాగిన ఫీలింగ్ నే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
శొంటి : జీర్ణానికి మంచిది, జలుబు-దగ్గు తగ్గిస్తుంది.
మిరియాలు: ఆహారం డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. శరీరాన్ని వేడి చేస్తుంది.
యాలుకలు: నోటి దుర్వాసన తగ్గిస్తాయి, మనసును ప్రశాంతం చేస్తాయి.
దాల్చిన చెక్క - రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్.
చిట్కాలు:
ఎక్కువ మసాలా వేస్తే చేదుగా లేదా వెగటుగా ఉంటుంది, కాబట్టి మోస్తరుగా వేయండి. పాలు లేకుండా నీళ్లతో చేస్తే మరింత లైట్‌గా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం తాగితే బాగుంటుంది.













Click it and Unblock the Notifications