నెల్లూరు స్పెషల్ వంటకం.. మసాలా వడల పులుసు.. సూపర్ టేస్ట్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ జిల్లాకు ఆ జిల్లాకు ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. అలా నెల్లూరు జిల్లాలో స్పెషల్ వంటకాలు ఉంటాయి.నెల్లూరు స్టైల్ మసాలా వడలపులుసు చాలా స్పెషల్. ప్రత్యేక రుచుల్లో ఒకటైన మసాలా వడలపులుసు స్పైసీ, టాంగీ టేస్ట్‌తో ఫుడ్ లవర్స్‌కు ఫేవరెట్ వంటకం. బయట క్రిస్పీగా, లోపల మృదువుగా ఉండే మసాలా వడలను కారం పులుపు మిశ్రమంలో ముంచి తయారుచేసే ఈ వంటకం అన్నం, ఇడ్లీ, దోశతో సరిపోతుంది.

వడల కోసం:

శనగపప్పు – 1 కప్పు

ఉల్లిపాయ-- కట్ చేసిన ముక్కలు

పచ్చిమిర్చి- 4

కరివేపాకు- 2 రెమ్మలు

జీలకర్ర- ఒక స్పూన్

ఉప్పు- అర స్పూన్

నూనె – వేయించడానికి

పులుసు కోసం:

ఉల్లిపాయలు – 2

టమోటాలు – 2

చింతపండు రసం- ఉసిరికాయంత

కారం పొడి- 2 స్పూన్లు

పసుపు- అర స్పూన్

ధనియాల పొడి- ఒక స్పూన్

పోపు గింజలు - ఒక స్పూన్

nellore masala vadala pulusu super tasty nellore style pulusu make this pulusu in this method

తయారీ విధానం

శనగపప్పును 3–4 గంటలు నానబెట్టి ముద్దలా రుబ్బాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి వడల పిండి తయారు చెయ్యాలి. పాన్‌లో నూనె వేసి మసాలా వడలను తయారు చెయ్యాలి. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి పోపు గింజలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలను వేసి బాగా మగ్గించాలి. అందులో చింతపండు రసాన్ని పోసి బాగా మరిగించాలి.

నెల్లూరు స్టైల్ మసాలా వడల పులుసు

పులుసులో అర స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మరిగాక అందులో చివరగా వేయించిన వడలను పులుసులో వేసి 5–10 నిమిషాలు మరిగించాలి. అంతే రుచికరమైన నెల్లూరు స్టైల్ మసాలా వడల పులుసు రెడీ అవుతుంది. వడలకు పులుసు పట్టాక తింటే ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది ట్రై చేస్తే మీరే చెప్తారు సూపర్ టేస్టీ అని.ఇదితింటే క్రిస్పీగా, జ్యూసీగా, టేస్టీ గ చాలా బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+