'పెప్పర్ సూప్' ఇలా చేసుకుంటే జలుబు, దగ్గు మాయం..!
సాధారణంగా వర్షాకాలం.. శీతాకాలంలో చాలామంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడతారు. అలాంటి వారిలో రోగనిరోధక శక్తిని పెంచి తక్షణ ఉపశమనం కలిగించే విధంగా ఈ మిరియాల సూప్ ఉపయోగపడుతోంది. మిరియాలను ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శీతాకాలంలో మిరియాలతో వంటకాలు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. మరి ఈ హెల్దీ మిరియాల సూప్ ఎలా తయారు చేసుకోవాలి..?
ముందుగా మిరియాల సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను ఓసారి చూస్తే.. ఒక టేబుల్ స్పూన్ మిరియాలు.. ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, తరిగిన ఉల్లిపాయలు ఒకటి, తగినంత నూనె లేదా నెయ్యి, నీళ్లు తగినన్ని.. రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తురుము..
మిరియాల సూప్ తయారీకి ముందుగా.. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు మిశ్రమాన్ని ఓ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనే లేదా నెయ్యి పోసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగులోకి మారగానే ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి.

అదే మిశ్రమంలో టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోయాలి. బాగా కలపాలి. అందులోనే తగినంత ఉప్పు వేసి మీడియం మంట మీద 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో కొత్తిమీర చల్లితే సరి.. ఘాటైన మిరియాల సూప్ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications