ఓట్స్ ను రోజూ తింటున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!
ఓట్స్. ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఓట్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఓట్స్‌లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, జింక్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక ప్రక్రియలకు అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, బరువును తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహకరిస్తుంది. అయితే, ఓట్స్ ను రోజు తీసుకోవటం మంచిదంటున్న నిపుణులు.. ఎలా తీసుకోవాలో సూచిస్తున్నారు.
మన ఆరోగ్యానికి మేలు చేసే తృణ ధాన్యాలల్లో ఓట్స్ కూడా ఒకటి. వీటిలో బీటా గ్లూకాన్ అని పిలువబడే కరిగే ఫైబర్ తో పాటు అవెనాంత్రామైడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఓట్స్ ను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ ను బంధిస్తుంది. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ ను 8 వారాల పాటు తీసుకోవడం వల్ల సిస్టోలిక్ బీపీ 2 నుండి 3 ఎమ్ఎమ్ హెచ్‌జి వరకు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఓట్స్ ను రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు. ఓట్స్ ను తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్స్ రక్తంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు ఓట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి.

ఇలా తీసుకుంటే మరింత ప్రయోజనకరం
ఓట్స్ లో మెగ్నిషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యం మెరుగుపడు తుంది. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. దీంతో మనం క్యాలరీలను తక్కువగా తీసుకుంటాం. తద్వారా శరీర బరువు అదుపులో ఉంటుంది. ఓట్స్ ను తీసుకోవడం వల్ల పేగులో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా అనేక రకాలుగా ఓట్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారంగా ఓట్స్ తీసుకోవచ్చు. దీనికి పండ్లు, గింజలు, పాలు లేదా పెరుగు వంటివి కలుపుకోవచ్చు.












Click it and Unblock the Notifications