నయా స్టైల్ లో పప్పులుసు కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ డబుల్..!
రోజూ చేసుకునే వంటకాల్లో పప్పు కచ్చితంగా ఉంటుంది. పప్పు లేదా పప్పు చారు, సాంబార్ ఇలా రోజూ ఏదో ఒకటి ఉండాల్సిందే. ముఖ్యంగా వేసవిలో పప్పు చారు ఎక్కువగా చేసుకుంటారు. త్వరగా జీర్ణం కావడంతోపాటు శరీరానికి సరిపడా శక్తిని ఇస్తుంది. అయితే పప్పులుసును ఇలా కొత్త పద్ధతిలో ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా చేస్తే పప్పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. సూపర్ టేస్ట్ గా ఉండే పప్పులుసును ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇంట్లోనే ఈజీగా ఈ పప్పులుసు తయారీ విధానం ఇక్కడ చూడండి..
పప్పులుసు తయారీ విధానం చూస్తే ముందుగా కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. కందిపప్పు ఒక కప్పు, టమాటోలు రెండు ముక్కలుగా కట్ చేసినవి, ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, చింతపండు పులుసు అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పసుపు అర టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె రెండు టేబుల్ స్పూన్ లు, తాలింపు గింజలు.. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు తీసుకోవాలి.

ఇప్పుడు పప్పులుసు తయారీ విధానం చూస్తే ముందుగా పప్పును కడిగి టమాటోలతో కలిపి పసుపు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత బాణలిలో నూనె వేడి చేసి తాళింపు పదార్థాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉడికిన పప్పు, కారం, చింతపండు పులుసు పోయాలి. అలా మరిగించుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి మరికొంతసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపుకుంటే సరి.. సూపర్ టేస్టీ పప్పులుసు రెడీ అయినట్టే.. ఈ పప్పులుసును వేడి వేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications