టేస్టీ టేస్టీ "బెల్లం పరమాన్నం" ఎలా చేయాలంటే !

సంక్రాంతి పండుగకు కొత్త ధాన్యం రాకతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉంటాయి. ఈ పండుగల వేళ భోగి మంటల దగ్గర పరమాన్నం వండుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. చాలామంది ఇంట్లోనే పరమాన్నం తయారు చేసుకుంటున్నప్పటికీ.. గుడిలో ప్రసాదంగా లభించేలా చల్లారినా గట్టిపడకుండా, మృదువుగా క్రీమీగా ఉండే పరమాన్నం చేయడం అంత సులభం కాదు. అలాంటి పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ బెల్లం పరమాన్నం కావాలంటే కొన్ని చిన్న చిట్కాలు తప్పక పాటించాలి.

పరమాన్నం విజయానికి ముఖ్యమైన అంశం పాలు విరగకుండా చూసుకోవడం. అలాగే బియ్యం-పప్పు సరైన నిష్పత్తి, మంట నియంత్రణ, బెల్లం వేసే సమయం ఇవన్నీ రుచిని నిర్ణయిస్తాయి. కింద ఇచ్చిన పదార్థాలు, విధానాన్ని అనుసరిస్తే, మీరు కూడా ఇంట్లోనే గుడి ప్రసాదం రుచితో, సువాసనతో పరమాన్నం తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం ఎలానో మీకోసం ప్రత్యేకంగా..

paramannam-making-recipe-in-telugu-with-easy-steps

కావలసిన పదార్థాలు..

  • బియ్యం - 1/2 గ్లాసు
  • పెసరపప్పు - 1/2 గ్లాసు (సమానంగా తీసుకుంటే రుచి మరింత బాగుంటుంది)
  • పాలు - 4 గ్లాసులు (ఫుల్ క్రీమ్ లేదా చిక్కటి పాలు)
  • నీళ్లు - 4 గ్లాసులు (నానబెట్టడానికి 1 గ్లాసు, వండడానికి 3 గ్లాసులు)
  • బెల్లం తురుము - 2 గ్లాసులు
  • యాలకుల పొడి - తగినంత
  • పచ్చ కర్పూరం - చిటికెడు (గుడి ప్రసాదపు సువాసన కోసం)
  • నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు, కిస్మిస్ - సరిపడా

ముందస్తు తయారీ..

ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి, ఒక గ్లాసు నీటిలో కనీసం అరగంట నుంచి గంటసేపు నానబెట్టాలి. ఇలా చేస్తే అవి త్వరగా ఉడుకుతాయి, పరమాన్నం మరింత క్రీమీగా వస్తుంది. ఇదే సమయంలో బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవడం మంచిది.

పరమాన్నం తయారీ విధానం..

  • మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో 4 గ్లాసుల పాలు, 3 గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. పాలు అడుగంటకుండా గరిటెతో తరచూ తిప్పుతూ ఉండాలి.
  • పాలు కొద్దిగా చిక్కబడి దగ్గరపడిన తర్వాత, నానబెట్టిన బియ్యం-పప్పును నీళ్లతో సహా పాల మిశ్రమంలో కలపాలి.
  • మంటను మీడియం నుంచి తక్కువ మంటకు తగ్గించి, అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ అన్నం మెత్తగా, క్రీమీగా ఉడికే వరకు వండాలి.
  • అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపివేయాలి. వెంటనే బెల్లం తురుమును వేసి బాగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు వదిలేయాలి.
  • స్టవ్ ఆన్‌లో బెల్లం వేస్తే పాలు విరిగిపోవచ్చు. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, బెల్లం పూర్తిగా కరిగేలా మెల్లగా కలపాలి.
  • ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి, తక్కువ మంటపై ఉంచాలి. యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల పరమాన్నానికి గుడి ప్రసాదంలా అద్భుతమైన సువాసన, ప్రత్యేక రుచి వస్తుంది.
  • చివరగా చిన్న పాన్‌లో నెయ్యి వేడిచేసి, జీడిపప్పు, కిస్మిస్‌లను దోరగా వేయించి, నెయ్యితో సహా పరమాన్నంలో కలపాలి. బాగా కలిపి స్టవ్ ఆపివేయాలి.

ప్రత్యేక చిట్కాలు..

  • పరమాన్నం చల్లారినా గట్టిపడకుండా ఉండాలంటే, పాలు, నీళ్ల పరిమాణం కొంచెం ఎక్కువగా ఉండాలి.
  • నెయ్యి వాసన కోసం చివర్లో కొద్దిగా నెయ్యి పై నుంచి పోసినా మరింత రుచిగా ఉంటుంది.
  • ఈ పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టడానికి కూడా ఇదే పర్ఫెక్ట్ రెసిపీ.

ఇలా తయారు చేసిన బెల్లం పరమాన్నం చల్లారినా క్రీమీగానే ఉంటుంది. భోగి, సంక్రాంతి పండుగ రోజుల్లో దేవునికి నైవేద్యంగా సమర్పించడానికైనా, కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికైనా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+