ఎగ్ మసాలా కూర- ఇంట్లోనే రెస్టారెంట్ రుచితో.. వదిలిపెట్టేదే లేదు!
ఎగ్ మసాలా కూర అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇంట్లో చేస్తే రెస్టారెంట్‌లో ఇచ్చినంత రుచి రాదని అనుకుంటారు. నిజానికి కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే అద్భుతమైన రుచి వస్తుంది. ఇంట్లోనే సూపర్ టేస్టీ ఎగ్ మసాలా కూర చేస్తే బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేస్తే ఇంకెవరూ వదిలిపెట్టరు.
కావాల్సినవి
గుడ్లు - 6
ఉల్లిపాయలు - 3 (సన్నగా తరిగినవి)
టమాటాలు - 3
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1.5 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - కొన్ని ఆకులు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
పసుపు- పావు స్పూన్
కారం- స్పూన్ న్నర
ధనియాల పొడి- ఒక స్పూన్
గరం మసాలా- అర స్పూన్
ఉప్పు - స్పూన్ న్నర
కొత్తిమీర - కొద్దిగా

కూర తయారీ విధానం
ముందుగా గుడ్లను ఉడకబెట్టి, తొక్క తీసి రెండు పక్కలా కొద్దిగా గాట్లు పెట్టండి. ఇలా చేస్తే మసాలా లోపలికి బాగా పడుతుంది. పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేలా బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే గ్రేవీ రిచ్‌గా ఉంటుంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించి, టమాటాలు వేసి మెత్తబడేలా ఉడకనివ్వండి.
ఇలా చేస్తే సూపర్ టేస్ట్
అందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ న్నర కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లు చేర్చి గ్రేవీ ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిన గుడ్లు వేసి, గరం మసాలా చల్లి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. చివర్లో కొత్తిమీర చల్లి దించేయండి. ఉల్లిపాయలు బాగా వేయించడం మర్చిపోకండి. ఎగ్ మసాలా గ్రేవీ హాట్ హాట్‌గా అన్నం లేదా చపాతీతో వడ్డిస్తే సూపర్ గా ఉంటుంది. ఈ కూర ఇలా వండితే ఎవరైనా రెండు మూడు గుడ్లు తినకుండా ఉండరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.













Click it and Unblock the Notifications
