బరువు తగ్గాలంటే ఈ డ్రై ఫ్రూట్ తినండి.. కానీ

ప్రస్తుతం ఒబేసిటీ సమాజంలో చాలా పెద్ద సమస్యగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గడం అనేది చాలామంది ముందున్న ప్రధాన లక్ష్యంగా మారింది. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో పాటు పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవడం బరువు తగ్గటానికి తప్పకుండా తీసుకోవాల్సినవి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారం విషయానికి వస్తే పిస్తా పప్పు ఒకటి.

పిస్తా పప్పులో ఫుల్ పోషకాలు

చిన్నదిగా కనిపించినా, ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ ఇన్నీ కావు. పిస్తా పప్పు బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అంతేకాదు విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి శక్తినిచ్చేలా పనిచేయడమే కాకుండా, ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేస్తాయి.

Pistachios For Weight Loss know how to eat the pistachios for weight reduction in a healthy way

బరువు నియంత్రణకు పిస్తా పప్పు

ఫలితంగా మధ్య మధ్యలో ఆకలి వేయడం తగ్గి, జంక్ ఫుడ్ తీసుకునే అలవాటు తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఇతర డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే పిస్తాలో కాలరీలు తక్కువగా ఉంటాయి. పిస్తాకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది. ఇది డయాబెటిస్ ను నియంత్రిస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా బరువు పెరగకుండా ఇది చూస్తుంది.

ఎక్కువ పిస్తా పప్పు తింటే డేంజర్

అయితే, పిస్తా పప్పును పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. రోజుకు సుమారు 20 నుంచి 30 పిస్తా పప్పులు సరిపోతాయి. ఉప్పు లేకుండా లేదా తక్కువ ఉప్పుతో ఉన్న పిస్తా తీసుకోవడం మంచిది. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అధికంగా తింటే కాలరీలు పెరిగి, బరువు తగ్గడంలో ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

బరువు నియంత్రణకు పిస్తా మంచి ఎంపిక

మొత్తంగా చూసుకుంటే, బరువు తగ్గాలని భావించే వారు సమతుల్య ఆహారం మరియు నియమిత వ్యాయామంతో పాటు, తినే ఆహారంలో కచ్చితంగా పిస్తా పప్పును చేర్చుకుంటే బరువు తగ్గడంలో సహాయకారి అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సహజంగా బరువు నియంత్రించుకోవాలనుకునే వారికి పిస్తా పప్పు మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+