వేసవిలో మట్టి కుండ నీళ్లు ఇలా తాగితే, ఆ సమస్యలన్నీ పరార్..!!
వేసవిలో ఎండలు పెరుగుతున్నాయి. శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎట్టి పరిస్థితుల్లోనూ డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి. అయితే, చల్లదనం కోసం ఎక్కువ మంది ప్రిజ్ కు ప్రాధాన్యత ఇస్తారు. దీని వలన కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు. అయితే, మట్టి కుండలోని నీటిని వేసవిలో తీసుకోవటం ద్వారా ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి.
మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటి నాణ్యత మెరుగుపడుతుంది. కుండకు ఉన్న పోరస్ స్వభావం నీటి నుండి మలినాలను ఫిల్టర్ చేసి, నీటిని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి బాగా చల్లటి పదార్థాలు తిన్నా, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగినా జలుబు చేస్తుంది. అదే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగితే వారికి జలుబు రాదు. మట్టి ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం. అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ దాగుంటుంది. ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తపడచ్చు. ఈ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి. జీర్ణ వ్యవస్థ బలంగా మారి, వేసవిలో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. చల్లటి నీటి కోసం ఫ్రిజ్, వాటర్ ఫ్యూరిఫైర్ వంటి ఎలక్రానిక్ వస్తువుల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం కంటే మట్టి కుండలో నీరు సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కుండ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
మట్టి కుండలో నీరు తీసుకుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి. వడదెబ్బ సమస్య నుంచి రక్షణ పొందాలనుకుంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరు తాగడమే మంచిది. మట్టిలో ఉండే వివిధ రకరకాల విటమిన్స్, మినరల్స్ అందులో నిల్వ ఉచిన నీటికి చేరి శరీరానికి మేలు చేస్తాయి. కుండలో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో రోజూ కుండ నీటిని తాగితే.. పొట్ట సమస్యల నుండి కూడా ఉపశమనం పొందొచ్చు. వేసవిలో చెమట వల్ల చర్మం జిడ్డుగా తయారై చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుండ నీళ్లు తాగితే ఆ సమస్యల నుండి దూరం కావచ్చు. మట్టి కుండ నీరు బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఈ నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది. దీంతో.. వేసవిలో మట్టి కుండ నీటిని తాగేందుకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆరోగ్య పరమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
-
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు












Click it and Unblock the Notifications