నోట్లో ఒక్కటి వేసుకుంటే... గ్యాస్, ఎసిడిటీ పరార్
ప్రస్తుత రోజుల్లో ఎక్కువమంది గ్యాస్, ఎసిడిటీతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్న వయసువారిలో కూడా ఇవే సమస్యలు తలెత్తుతున్నాయి. మందులతో పనిలేకుండా గ్యాస్ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం ఉంది. అది ఎండు ద్రాక్ష. జీవనశైలి గజిబిజిగా తయారవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లవల్ల అనేకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా చాలామంది ఉదర సంబంధ వ్యాధులను ఎదుర్కొంటున్నారు.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుంటే.. కడుపులో గ్యాస్ పేరుకుపోతుంది. దీనివల్ల అపాన వాయువు సమస్య వస్తుంది. గ్యాస్ బాగా పెరిగి పుల్లటి త్రేన్పులు వస్తాయి. ఒక్కోసారి తీవ్రమైన కడుపునొప్పి కూడా వస్తుంది. ఈ వ్యాధులకు ఎండుద్రాక్ష చక్కగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ , ఫైబర్ వంటి పోషకాలున్నాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడంద్వారా వ్యాధినిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.

ఎసిడిటీ, అలసత, మలబద్ధకంలాంటి సమస్యలుంటే ఎండు ద్రాక్ష వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎముకలు, దంతాలు రెండింటికీ ప్రయోజనం కలుగుతుంది. రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు నుంచి రక్షిస్తుంది. ఎండు ద్రాక్షలోని పీచు.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొట్టను శుభ్రం చేయడంలో దోహదపడుతుంది. రక్తపోటు అదుపులో ఉండటమేకాక ప్రతిరోజు ఖాళీకడుపుతో వీటిని తోసుకోవడంవల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
గుప్పెడు ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి ఆ తర్వాత వాటిని తిని నీరు తాగితే శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్తాయి. ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్స్ వల్ల ఇది యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది . ఎముకల తయారీకి, ఇవి గట్టిపడటానికి ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది. భోజనంలో ఎండుద్రాక్షను చేర్చడంవల్ల సులభంగా బరువు తగ్గుతారు.












Click it and Unblock the Notifications