రంజాన్ స్పెషల్ సూప్.. ఇలా ఈజీగా చేసుకోండి..!
పవిత్ర రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ పవిత్రమాసంలో అనేకమంది ఉపవాసంలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఉపవాస విరమణ సమయంలో ముస్లింలు ఖర్జూరాలతోపాటు పండ్లు, హలీం లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో ముస్లింలు తీసుకునే స్పెషల్ వంటకం కూడా ఉంది అదే స్పెషల్ సూప్. ఈ సూప్ తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఆంధ్రా స్టైల్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం చూస్తే..?
ఈ స్పెషల్ రంజాన్ సూప్ తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఓ పెద్ద పాత్రను పెట్టుకోవాలి. దానిలో నెయ్యి వేయాలి. లేదా నూనె కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క , బిర్యానీ ఆకు వేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారెట్ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉల్లిపాయ, క్యారెట్ మగ్గే వరకు ఉడికించుకోవాలి.

క్యారెట్, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులను వేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఉప్పు కలపాలి. అలా మరో రెండు నిమిషాల పాటు మగ్గించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బొంబాయి రవ్వను వేసి..నెమ్మదిగా కలుపుతూ ఉండలు కట్టకుండా చూడాలి. అలా రెండు లేదా మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన గంజిని వేడివేడిగా బూందీతో కలిపి తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications