రాయలసీమ పచ్చిమిర్చి పప్పు .. ఇలా చేసి తింటే మళ్ళీ కావాలంటారు!
మనం రకరకాల పప్పులను వండుకుని తింటూ ఉంటాం. పప్పు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా, వెరైటీగా ఈసారి రాయలసీమ స్టైల్ పచ్చిమిర్చి పప్పును ఇలా చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీని రుచి వేడి అన్నంతో నెయ్యి కలిపి తిన్నా, చపాతీ రోటీలతో జతచేసినా అద్భుతంగా ఉంటుంది. కుక్కర్‌లో తక్కువ సమయంలోనే సులువుగా తయారు చేసుకునే పచ్చిమిర్చి పప్పు ఎలా చెయ్యాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
కందిపప్పు - అర కప్పు
పచ్చిమిర్చి- 12
ఉల్లిపాయలు- 3
టమాటోలు- 3
ధనియాలు- 1 టీస్పూన్
జీలకర్ర- 2 టీస్పూన్లు
పసుపు- అర టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- 2 టేబుల్‌స్పూన్లు
శనగపప్పు- 1 టేబుల్‌స్పూన్
మినపప్పు- 1 టీస్పూన్
ఆవాలు- 1 టీస్పూన్
ఎండుమిర్చి- 2
వెల్లుల్లి- 3 రెబ్బలు
ఇంగువ- పావు టీస్పూన్
కరివేపాకు- 2 రెమ్మలు
కొత్తిమీర- కొద్దిగా

తయారీ విధానం:
ముందుగా అర కప్పు కందిపప్పును తగినన్ని నీళ్లలో అరగంట పాటు నానబెట్టాలి. మూడు ఉల్లిపాయలు, మూడు టమాటోలను చిన్న ముక్కలుగా కోసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్‌లో నానబెట్టిన కందిపప్పు, 12 పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ, టమాటో ముక్కలు, ఒక టీస్పూన్ ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ పసుపు, అర లీటరు నీళ్లు, సరిపడా ఉప్పు వేయాలి. మూతపెట్టి, మీడియం మంటపై మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
ఇలా చేస్తేనే పప్పు రుచిగా ఉంటుంది
కుక్కర్ విజిల్ ఆవిరి వదిలిన తర్వాత పప్పును మెత్తగా మాష్ చెయ్యాలి. మరోవైపు, తాలింపు కోసం పాన్ స్టవ్ మీద పెట్టి, అది వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి, నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలు కచ్చా పచ్చాగా దంచినవి వేసి దోరగా వేయించాలి.
నోరూరించే రాయలసీమ పచ్చిమిర్చి పప్పు
ఆపై, పావు టీ స్పూన్ ఇంగువ, కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి దోరగా వేయించాలి. ఇలా సిద్ధం చేసుకున్న తాలింపును ఉడికించిన పప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపితే, నోరూరించే రా
-
రెస్టారెంట్ స్టైల్ 'పాలక్ పనీర్' కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
ఖాళీ కడుపుతో ఉసిరి పౌడర్ కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోండి చాలు..!! -
దగ్గుతో బాధపడేవారు ఈ ఆహారాలు తినొద్దు! -
గోదావరి స్టైల్ "పీతల పులుసు" ఇలా చేస్తే యమా టేస్ట్ అంతే ! -
రంజాన్ స్పెషల్ సూప్.. ఇలా ఈజీగా చేసుకోండి..! -
పక్కా తెలంగాణ స్టైల్ "మటన్ బోటి ఫ్రై" ట్రై చేస్తారా.. ! -
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో ఎవరికి ఏది మంచిది..!! -
Coffee లవర్స్ కు గుడ్ న్యూస్. కప్పున్నర కాఫీ లివర్ కు బూస్ట్ -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
విజయ్ విడాకుల రచ్చ వేళ.. పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్ !! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
ఏపీలో మహిళా దినోత్సవ కానుక-ఈ 3 పథకాల ప్రారంభం..! -
సీఎం రేవంత్ దంపతులను కలిసిన నటి రష్మిక.. -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!!













Click it and Unblock the Notifications