ఆలుగడ్డ ఇన్స్టంట్ ఫ్రై.. విత్ టమాటా చారు .. ఇలా తింటే అమృతమే!
ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు భోజనానికి ఇన్స్టెంట్ గా ఏం పెట్టొచ్చు అని ఆలోచించేవాళ్ళు, ఈజీ ఆలుగడ్డ ఫ్రై, టమాట చారు చేసిపెడితే తక్కువ సమయంలో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇన్స్టెంట్ గా ఈ విధానంలో వాటిని తయారుచేసి పెట్టినప్పుడు, తిన్నవాళ్లు ఆహా ఏమి రుచి అని అనక మానరు. అందుకే తక్కువ సమయంలో తొందరగా వండి పెట్టగలిగిన ఆలుగడ్డ ఫ్రై విత్ టమాట చారు రెసిపీని తెలుసుకుందాం.
ఆలుగడ్డ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు:
ఆలుగడ్డలు – 3 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
నూనె – ఫ్రై చేయడానికి కావలసినంత
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
కారం – తగినంత
ధనియాల పొడి- ఒక స్పూన్

టమాటా చారు కోసం:
టమాటాలు – 3 ( చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
వెల్లుల్లి – 4 రెబ్బలు (నూరినవి)
ఆవాలు – ½ టీస్పూన్
జీలకర్ర – ½ టీస్పూన్
పసుపు – చిటికెడు
కారం – 1 ½ స్పూన్
ఉప్పు - 1 ½ స్పూన్
చింతపండు – ఉసిరికాయంత
కొత్తిమీర – కొద్దిగా
ధనియాల పొడి- ఒక స్పూను
తయారీ విధానం
ఇన్‌స్టంట్ ఆలుగడ్డ ఫ్రై తయారీకి ఒక పాన్ లో నూనె పోసుకుని నూనె బాగా వేడి అయిన తర్వాత, మంట తగ్గించుకుని అందులో కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను డైరెక్ట్ గా వేసి అవి గోల్డెన్ కలర్ లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్న సమయంలోనే పక్క వేరే స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాక కరివేపాకు వెయ్యాలి.
ఒకేసారి రెండూ ఇలా చెయ్యొచ్చు
అందులో టమాటాలు వేసి మగ్గనివ్వాలి. అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా పేస్ట్ లా అయ్యేదాకా మగ్గనివ్వాలి. మధ్యలో మనం ఆలుగడ్డ ఫ్రై మాడిపోకుండా కలుపుకుంటూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి కలుపుకుంటే ఆలు ఫ్రై రెడీ అయినట్టే.
ఇలా చేసి తింటే అమృతమే
ఇక టమాటా చారులోకి బాగా మగ్గిన టమాటా గుజ్జులో కి చింతపండు నానబెట్టిన రసం పోసి వెల్లుల్లి రెబ్బలు దంచుకొని అందులో యాడ్ చేసి కాస్త మసలుతూ ఉండగా ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే టమాట చారు రెడీ అవుతుంది. ఈ రెండింటిని తయారు చేసుకోవడం కచ్చితంగా పావుగంటలో అయిపోతుంది. ఈ ఇన్స్టంట్ టమాటా చారును, ఆలుగడ్డ ఫ్రై ను వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అమృతంలా పోతుంది. ఇంటికి వచ్చిన అతిథులకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ విధానంలో మీరు కూడా ట్రై చేసేయండి.












Click it and Unblock the Notifications