శనగపప్పు మటన్ ఇలా చేసుకు తింటే పండుగే!

శనగపప్పు మటన్ కూర ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన వంటకం. ఈ కూరలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. అన్నంతో కానీ, రోటీతో కానీ, బిర్యానీతో కానీ బాగా సరిపోతుంది. ఈ శనగపప్పు, మటన్ ను ఇంట్లో సులభంగా తయారుచేసుకునే విధానం చూద్దాం.

అవసరమైన పదార్థాలు:

మటన్ ముక్కలు - అర కిలో ,
శనగపప్పు- ఒక కప్పు (రాత్రి నుంచి నానబెట్టి ఉంచాలి),
పెద్ద ఉల్లిపాయలు - రెండు కట్ చేసుకున్నవి,
టమోటాలు - రెండు కట్ చేసుకున్నవి,
పచ్చి మిరపకాయలు - 4,
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్
ధనియాలు, జీలకర్ర పొడి - ఒక స్పూన్
గరం మసాలా - అర స్పూన్
మిరియాల పొడి- పావు స్పూన్
పసుపు - అర స్పూన్
ఉప్పు- రుచికి తగినంత
నూనె-2 టేబుల్ స్పూన్స్
కరివేపాకు- కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా

Senagapappu Mutton Curry Recipe - Know making process of Authentic Andhra Style Chickpea Mutton Curry

తయారీ విధానం

ముందుగా నానబెట్టిన శనగపప్పును వేరుగా ఉడికించి ఉంచాలి. మటన్ ముక్కలను ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో కలిపి 15-20 నిమిషాలు ఉంచాలి. తర్వాత కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆకుపచ్చి మిరపకాయలు వేసి వాసన వచ్చేలా వేయించాలి. టమోటాలు వేసి మెత్తగా అయ్యేలా వండాలి.ఇప్పుడు మటన్ ముక్కలు వేసి బాగా వేయించాలి.

మసాలా పొడులు ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఆపై అందులో నానబెట్టుకున్న శనగపప్పు వేసి కలిపి తగినంత నీళ్ళు పోసి 4-5 విజిల్స్ వచ్చేలా ఉడికించాలి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మటన్ మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఆరోగ్యపరంగా చూస్తే శనగపప్పులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మటన్‌లో కూడా ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఈ కూర శరీరానికి బలాన్ని ఇస్తుంది.

అలసట, విపరీతమైన నొప్పులు.. ఈ లోపం కావచ్చు.. నిర్లక్ష్యం చేస్తే డేంజర్!
అలసట, విపరీతమైన నొప్పులు.. ఈ లోపం కావచ్చు.. నిర్లక్ష్యం చేస్తే డేంజర్!

పిల్లలు, పెద్దలు అందరికీ ఇది తింటే మంచిది. వారం ఒకసారి ఈ కూర చేస్తే ఇంట్లో అందరూ ఇష్టపడతారు. శనగపప్పు మటన్ కూరను వేడి వేడి అన్నంతో, కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. ఇంట్లో సులభంగా, రుచిగా తయారయ్యే ఈ వంటకాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+