ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేస్తున్నారా, గుండెపోటు ముప్పు - ఈ జాగ్రత్తలు అవసరం..!!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూర్చొని చేసే ఉద్యోగాలే కనిపిస్తున్నాయి. శరీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. సెల్ ఫోన్‌లు, కంప్యూటర్లతో ఏ.సి గదుల్లో ఉద్యోగాల కారణంగా గంటలు గంటలు అలానే కూర్చోని ఉండడం పెరిగిపోయింది. ఒకే చోట గంటల తరబడి కూర్చుని పని చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఇలా ఉన్న వారు ఇప్పటికే చాలా మందిని అనేక రకాల జబ్బులతో అనారోగ్యం పాలయ్యారు. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని సూచనలు చేస్తన్నారు.

ఎక్కువ స‌మయం కూర్చోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి హాని కలుగుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. కండ‌రాలు దెబ్బ‌తిన‌డం, జీవక్రియ నెమ్మ‌దించ‌డం, వెన్ను నొప్పి , హృద‌య సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ స‌మ‌యం కూర్చోవ‌డం ధూమ‌పానంతో స‌మాన‌మ‌ని వారు చెబుతున్నారు. రోజుకు 11 లేదా అంత‌కంటే ఎక్కువ గంట‌ల‌పాటు కూర్చోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం 1.40 రెట్టు ఎక్కువ‌గా ఉటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ స‌మ‌యం కూర్చోవ‌డం వ‌ల్ల గుండె కండ‌రాలు బ‌ల‌హీనంగా త‌యార‌వుతాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక శ‌రీరాన్ని సాగ‌దీసే స‌ర‌ళ‌మైన వ్యాయామాలు చేయాలి. గుండె ఆరోగ్యాన్ని మార్చుకోవ‌డానికి జీవ‌న‌శైలిలో మార్పులు చేసుకోవాలి. కూర్చోవ‌డం వ‌ల్ల, స‌రైన భంగిమ‌లో కూర్చోక‌పోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలిక న‌డుము నొప్పి వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

sitting-or-lying-down-for-too-long-increases-your-risk-of-chronic-health-problems-such-as-heart-dis

అనారోగ్య సమస్యలు ఖాయం

కాగా, నడుము నొప్పి మొత్తం జీవ‌నాణ్య‌త‌ను త‌గ్గిస్తుంది. కొన్ని సార్లు చాలా మంది త‌మ ప‌నుల‌ను తాము కూడా స్వ‌యంగా చేసుకోలేక‌పోతారు. క‌నుక కండ‌రాల‌కు ప్రాధాన్య‌త‌ను ఇచ్చే వ్యాయామా లు, పని శైలిని మార్చుకోవ‌డం ద్వారా న‌డుము నొప్పి స‌మ‌స్య‌ని అధిగ‌మించ‌వ‌చ్చు. కండ‌రాల ఆరోగ్యం క్ర‌మంగా క్షీణించే అవ‌కాశం ఉంది. క‌నుక విరామం తీసుకుంటూ కూర్చోవ‌డం, కండ‌రాల వ్యాయామాలు చేయ‌డం వంటివి చేయాలి. ఎక్కువ స‌మ‌యం కూర్చోవ‌డం వ‌ల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఎక్కువ స‌మయం వంగి కూర్చోవ‌డం వ‌ల్ల కీళ్లు, వెన్నెముక నిర్మాణంలో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. వెన్నెముక వంగ‌డం, త‌ల, మెడ స్థానాలు బ‌ల‌హీన‌ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. ఎక్కువ స‌మ‌యం కూర్చోవ‌డం వ‌ల్ల ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని ఎక్క‌వ స‌మ‌యం క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం శ‌రీరానికి మంచిది కాద‌ని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+