రోజూ మొలకలు తింటున్నారా.. అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

మొలకలు పోషకాలకు నిలయాలు. మొలకలు పోషకాలకు నిలయాలు. అవి అన్ని అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఉదయం మొలకలు తినడం ఆరోగ్యకరమైన మార్గాలలో ఒకటిగా పరిగణిస్తారు. మొలకలు జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, శ‌క్తి స్థాయిల‌ను పెంచ‌డం, ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌హాయ‌ప‌డ‌తాయి. ఇవి మొత్తం శ‌రీరానికి మేలు చేస్తాయని వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, మొలకలు తీసుకోవాల్సిన పరిమాణం.. ఎవరు ఏ విధంగా తీసుకోవాలో సూచిస్తున్నారు.

మొలకలు సహజ సిద్దమైన పోషకాలు అందిస్తాయి. మొల‌క‌ల‌ను ఉద‌యం పూట తీసుకోవ‌డం వ‌ల్ల ఆహారం సుల‌భంగా విచ్ఛినం అవుతుంది. జీర్ణ‌క్రియ స‌జావుగా సాగుతుంది. గ్యాస్, ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల పేగుల‌ క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. పేగుల్లో ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. మొల‌క‌ల్లో స‌హ‌జంగా ఉండే జీర్ణ ఎంజైమ్ లు ప్రోటీన్లతో పాటుగా మొల‌క‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి, ముఖ్య‌మైన ఖ‌నిజాలు ఉంటాయి. ఇవి రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. మొలకెత్తిన గింజల్లో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. దీని వలన ఎనర్జీగా ఉంటారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉద‌యం పూట మొల‌క‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్పెక్ష‌న్ లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

sprouts-regular-eating-can-lower-blood-glucose-levels-in-people-with-diabetes-as-latest-study-report

ఆరోగ్య ప్రయోజనాలు

మొలకలు రెగ్యులర్ గా తీసుకోవటం ద్వారా దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. వీటిని అల్పాహారంలో భాగంగా క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల సాధార‌ణ జ‌లుబు, కాలానుగుణంగా వ‌చ్చే ఫ్లూ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. సాధార‌ణంగా మొల‌క‌ల్లో ప్రోటీన్, ఐర‌న్, క్యాల్షియం వంటి పోష‌కాలు ఉంటాయి. నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మొల‌క‌ల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి., ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని తీసుకోవడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మొల‌క‌ల్లో విట‌మిన్ ఎ, సి, ఇ వంటివి ఉంటాయి. ఉద‌యం పూట మొల‌క‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వృద్దాప్య ఛాయ‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. మొల‌క‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల మెరిసే ఆరోగ్య‌క‌ర‌మైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు. ఇలా అనేక ర‌కాలుగా మొల‌క‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొల‌క‌ల‌ను ఆహారంలో భాగంగా స్థిరంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం లోప‌లి నుండి ఆరోగ్యంగా, బ‌లంగా త‌యార‌వుతుంద‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇక.. పరిమితిగా తీసుకోవటం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+