తెలంగాణ స్టైల్ 'మసాలా ఎగ్ పులుసు'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..!

రోజుకో గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి.. అని పెద్దలు అంటుంటారు. గుడ్డులో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. గుడ్డులోని విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ లు ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెబుతుంటారు. గుడ్డును ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. కొందరు ఉడకబెట్టుకుని తింటారు. మరికొందరు ఆమ్లెట్, ఫ్రై రూపంలో తీసుకుంటారు. ఇంకొందరు పులుసు పెట్టుకుంటారు. ఇలా ఏ రూపంలోనైనా గుడ్డు టేస్టీగానే ఉంటుంది. ఇక తెలంగాణ స్టైల్ మసాలా ఎగ్ పులుసు అంటే అందరికీ నోరూరుతుంది. పాతకాలం నాటి ఈ ఎగ్ పులుసుకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరి ఈ ఎగ్ పులుసును ఎలా తయారు చేసుకోవాలి..?

మసాలా ఎగ్ పులుసు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలను ఓసారి చూస్తే.. 4 లేదా 5 ఉడకబెట్టిన గుడ్లు, నూనె తగినంత, కొత్తిమీర తరుగు, పావు నువ్వులు, పావు పల్లీలు, పావు ఎండు కొబ్బరి పొడం, ధనియాలు, జీలకర్ర తగినంత, అలాగే తగినంత కారం, పసుపు, అల్లం పెస్టు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత చింతపండు పులుసు.. తీసుకోవాలి.

ఇక తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ మిశ్రమంలో కొబ్బరి పొడి వేసి వేయించుకుని.. మిక్సీలో వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో తగినంత నూనె పోసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగాక.. అప్పటికే మిక్సీలో మెత్తగా చేసుకున్న పొడిలో ఈ వేగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంతోపాటు అల్లం వెల్లలి పేస్ట్, కారం, ఉప్పు, చింతపండు పులుసు, పసుపు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.

Telangana Masala Egg Soup 15-Min Bachelor Hack That Tastes Like Amma s Kitchen

ఇక అప్పటికే ఉడకపెట్టిన గుడ్లను తీసుకుని వాటిని నూనెలో వేసి గరిటతో గాట్లు పెట్టుకోవాలి. గుడ్లను లో ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత గుడ్లను పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో అప్పటికే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు వేయాలి. నూనె పైకి తేలేదాక వేయించుకోవాలి. కొద్దిసేపటికి నూనె పైకి తేలాక అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ మాదిరి దగ్గరికి అయ్యాక ఆ పులుసులో గుడ్లను వేయాలి. ఆ తర్వాత మరో 15 నిమిషాలపాటు బాగా ఉడికించుకుని చివరిలో కొత్తిమీర తరుగు వేసి దించుకోవాలి. ఘుమఘుమలాడే ఎగ్ మసాలా రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+