తెలంగాణలో డెడ్లీ కాంబో ఇదే.. ఇంత కన్నా బెస్ట్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ !!
భారతదేశం వివిధ మతాలకు, ఆచారాలకు పుట్టినిల్లు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పద్దతులు ఉంటుంటాయి. రుచులు, ఆహారపు అలవాట్లలో కూడా గొప్ప వైవిధ్యం ఉంది. ప్రతి రాష్ట్రం తమ ప్రత్యేకమైన వంటకంతో దేశ ఆహార సంస్కృతిని సుసంపన్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక లలో ప్రధానంగా బియ్యం (రైస్) ఆధారిత ఆహారం ఉంటుంది. ఇక్కడి ఆహారంలో పులుపు, కారం, మసాలాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే ప్రధానంగా గోంగూర పచ్చడి, పులిహోర, వివిధ రకాల కారం దోసెలు, మాంసాహారంలో హైదరాబాదీ బిర్యానీ, నాటుకోడి కూర చాలా ప్రసిద్ధి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆహారం విషయంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శైలి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కాంబినేషన్ తెలంగాణలో ఫుల్ ఫేమస్. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నా కూడా ఇంత కంటే ఎన్నో కాంబినేషన్ లను ఇప్పట్లో ట్రై చేస్తూనే ఉంటున్నారు. అందుకే ఇదే అన్నింటి కన్నా బెస్ట్ కాంబినేషన్ అంటూ చెప్పుకొస్తున్నారు.

టీ & మురుకులు..
అవును.. మీరు చదువుతుంది నిజమే. చాలా ప్రాంతాలలో ఇలా అలవాటు లేకపోయినా తెలంగాణలో మాత్రం టీలో మురుకులు కలిపి తినడం బాగా అలవాటు. సాధారణంగా అయితే టీ లో బిస్కెట్, బన్ లాంటివి తీసుకుంటారు. కానీ ఇలా మాత్రం ట్రై చేయడం తెలంగాణ స్పెషల్ అని చెప్పాలి. అవి తయారీ ఎలానో మీకోసం ప్రత్యేకంగా..
బియ్యప్పిండి మురుకులు..
కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - 3 కప్పులు
- పుట్నాలపప్పు పొడి - 1 కప్పు
- కారం - 2 చెంచాలు
- వాము - 1 చెంచా
- ఉప్పు - తగినంత
- వాటర్ - 2 కప్పులు
- నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం..
- ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్(బేషన్)లో బియ్యప్పిండి, పుట్నాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- ఆపై అందులో కారం, వాము కూడా వేసి బాగా కలుపుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక చిన్న పాత్రలో వాటర్ తీసుకొని అందులో రెండు చెంచాల నూనె వేసి బాగా మరిగించాలి.
- ఆవిధంగా మరించుకున్నాక ఆ నీటిని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యప్పిండి మిశ్రమంలో పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని చల్లారనివ్వాలి.
- పిండి చల్లారిన తర్వాత గట్టిగా అయినట్లనిపిస్తే కొద్దిగా చల్లటి నీరు యాడ్ చేసుకొని మృదువుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని లోపల కాస్త నూనె అప్లై చేసి కొద్దిగా పిండిని అందులో పెట్టి రెండుమూడు వరుసలు వచ్చేలా జంతిక ఆకారంలో క్లాత్‌పై ఒత్తుకోవాలి.
- అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మురుకులను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈవిధంగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
- చల్లారాక వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలు.
ఇక టీ తయారీ విధానం అందరికీ తెలిసిందే కాబట్టి అలా టీ లో మిక్స్ చేసుకొని మీరు కూడా ఈ కాంబినేషన్ ఎంజాయ్ చేయండి.












Click it and Unblock the Notifications