ఈ లోపంతో బాధపడుతున్న మెజార్టీ ప్రజలు.. ఉదయాన్నే బయటకు రండి!
విటమిన్ డి లోపం ఇప్పుడు మన దేశంలో ప్రజలలో అతి ముఖ్యమైన సమస్యగా మారుతుంది. శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుదలకు విటమిన్-డి లోపం కూడా ఒక కారణం. చాలామంది విటమిన్-డి లోపాన్ని పట్టించుకోరు. కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ డీ లోపంతో బాధపడుతున్న వృద్ధులు, మధ్య వయస్కులు
మన దేశంలో అనేకమంది వృద్ధులు ,మధ్య వయస్కులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అసలు శరీరంలో విటమిన్ డి లోపం ఉందని గుర్తించలేకపోతున్నారు. కొన్ని లక్షణాలు ఉంటే విటమిన్-డి లోపం ఉన్నట్టు గుర్తుంచుకోవాలని, వైద్యులను సంప్రదించి విటమిన్-డి లోపాన్ని నివారించడానికి సప్లిమెంట్స్ తీసుకోవడంతోపాటు, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ఉదయం పూట సూర్యరశ్మికి శరీరాన్ని ఎక్స్పోజర్ చేయడం ద్వారా విటమిన్-డి లోపాన్ని నివారించవచ్చని చెబుతున్నారు.

ఈ లక్షణాలు ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్టే
ఇక విటమిన్ డి లోపం ఉంటే చిన్న పని చేసిన అలసటగా ఉంటుంది. ఎముకలు, కండరాల నొప్పులతో ఇబ్బంది పడతారు. ఏదైనా గాయమైతే నిదానంగా మానుతుంది. విపరీతంగా జుట్టు రాలిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు శరీరం పైన దాడి చేస్తాయి. చర్మం పాలిపోయినట్లుగా మారుతుంది. మానసిక స్థితి కూడా అంత బాగుండదు. విటమిన్ డి లోపంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
విటమిన్-డి లోపాన్ని నివారించడం కోసం తగిన జాగ్రత్తలు
ఇది మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి, రోగాలు త్వరగా సంక్రమించేలా చేస్తుంది. కనుక ఈ లక్షణాలు ఉంటే విటమిన్ డి లోపం ఉందని గుర్తించి అందుకు తగ్గట్టుగా విటమిన్-డి లోపాన్ని నివారించడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భారతదేశంలో అత్యధిక జనాభా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు సరైన జీవన శైలి లేక విటమిన్-డి లోపానికి గురవుతున్నారు.
విటమిన్ డీ లోపం నివారిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ
ఇక ఈ లోపాన్ని నివారించడానికి ఉదయం పూట ఎక్కువ సమయం బయట గడపాలని, సూర్యకాంతికి శరీరాన్ని ఎక్స్పోజర్ చేయాలని చెబుతున్నారు. ఆహారంలో విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారాలను సిఫార్సు చేస్తున్నారు. విటమిన్-డి లోపాన్ని నివారించగలిగితే దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.












Click it and Unblock the Notifications