బాత్ రూమ్‌లో హార్ట్ ఎటాక్‌లు ఎందుకు ఎక్కువగా వస్తాయి..ఈ జాగ్రత్తలు అవసరం..!!
చాలా మంది గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందుతున్నారు. పరిశోధనల్లో ఈ మరణాల వెనుక అనేక కారణాలు గుర్తించారు. హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్న వారికి వయసుతో సంబంధం ఉండటం లేదు. ఆరోగ్యంగా ఉన్నవారు సైతం సడన్ గా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. కాగా, బాత్ రూమ్ లో హార్ట్ ఎటాక్ తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీన వెనుక బలమైన కార ణాలు ఉన్నాయి..వీటిని గమనించి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
హార్ట్ ఎటాక్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, బాత్ రూమ్ లో హార్ట్ ఎటాక్ వెనుక అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. బాత్ రూమ్‌లో మల విసర్జన చేసినప్పుడు లేదా మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంపై కొన్నిసార్లు ఒత్తిడి బాగా పడుతుంది. అయితే అలాంటప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. దీని వల్ల ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగి.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

కొందరు మలం లేదా మూత్ర విసర్జన చేసేట ప్పుడు శరీరంపై బాగా ఒత్తిడిని కలగజేస్తారు. మల విసర్జన చేసినప్పుడు బాగా ఒత్తిడితో చేస్తారు. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకున్నా కూడా విసర్జించేటప్పుడు బాగా ఒత్తిడిని కలగజేస్తారు. దీని వల్ల వేగస్ నాడిపై ఒత్తిడి పడి భారం పెరుగుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది.
కాగా, కొందరు మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా భారీ మార్పులు వస్తాయి. దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది. ఇక, కొందరు బెడ్ మీద నుంచి లేచి వెంటనే హడావిడిగా బాత్‌రూమ్‌కు పరుగెత్తుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. దీని వల్ల కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
ఫలితంగా అది హార్ట్ ఎటాక్ కు దారి తీస్తుంది. బాత్ రూమ్‌లో మూత్రం లేదా మల విసర్జన చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి కలగజేయకూడదు. అలాగే మలం, మూత్రాన్ని ఎక్కువ సేపు బంధించకూడదు. స్నానం చేసేటప్పుడు కాస్త గోరు వెచ్చగా ఉన్న నీటితోనే స్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్లను తలపై కాకుండా కొన్ని నీళ్లను పాదాలపై పోసుకోవాలి. తరువాత నీళ్లను తలపై పోసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాత్ రూమ్‌లో హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు.
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
"గుత్తి వంకాయ కారం" టేస్టే వేరబ్బా.. ఎప్పుడైనా ట్రై చేశారా..? -
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
రెస్టారెంట్ స్టైల్ "జీడిపప్పు చికెన్ పకోడీ" ఇలా చేస్తే అదరహో !! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications