టమోటాలు రెగ్యులర్ గా తింటున్నారా- అయితే, ఇది మీ కోసమే..!!

టమోటాలు ప్రతీ ఇంటా నిత్యం వినియోగిస్తారు. అనేక రకాలుగా టమోటాలను ఆహారంలోకి తీసుకుంటారు. టమోటాలు పోషకాలతో నిండి ఉంటాయి. టమోటాల్లోని విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. ట‌మాటాల్లో లైకోపీన్ అనే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. లైకోపీన్ వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావం త‌గ్గుతుంది. అయితే, టామాటలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలకు బదులుగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

టమోటాలను తీసుకోవటం ద్వారా ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని లైకోపీన్ వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌ను రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. లైకోపీన్‌తోపాటు ట‌మాటాల్లో పొటాషియం, విట‌మిన్ సి అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ క‌ల‌సి గుండె ఆరోగ్యం కోసం ప‌నిచేస్తాయి. పొటాషియం వ‌ల్ల బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. లైకోపీన్ ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్ల‌తో క‌లిసి శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. ఇక ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయ‌ని చాలా మందికి తెలుసు. కానీ వీటిని రోజుకు ఎంత మోతాదులో తినాలి అని చాలా మందిలో సందేహం ఉంది. ట‌మాటాల్లో లైకోపీన్ అధిక మోతాదులో ల‌భించాలంటే ట‌మాటాల‌ను ఎల్ల‌ప్పుడూ ఉడికించే తినాలి. ప‌చ్చిగా ఉండే ట‌మాటా ల్లో లైకోపీన్ త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక లైకోపీన్ ఎక్కువ‌గా కావాల‌నుకునే వారు ట‌మాటాల‌ను ఉడ‌క‌బెట్టి తింటే మంచిది. ట‌మాటాల్లో ఉండే లైకోపీన్ ఎక్కువ‌గా కొవ్వుల్లో క‌రుగుతుంది.

tomatoes-are-packed-with-nutrients-but-overconsumption-can-trigger-acid-reflux-allergic-reactions

నిపుణుల సూచనలు

కాగా, ట‌మాటాల‌ను ఎప్పుడు తిన్నా కొవ్వు ప‌దార్థాల‌తో తింటే మేలు జ‌రుగుతుంది. ఆలివ్ ఆయిల్‌, అవ‌కాడో, చేప‌లు, నెయ్యి, గింజ‌లు, విత్త‌నాలు వంటి వాటితో క‌లిపి తింటే లైకోపీన్‌ను శ‌రీరం ఎక్కువ‌గా శోషించుకుంటుంది. అయితే ప‌చ్చి ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా లాభాలు ఉన్నాయి. ప‌చ్చి ట‌మాటాల‌ను తింటే విట‌మిన్ సి ని అధికంగా పొంద‌వ‌చ్చు. ట‌మాటాల‌ను ఉడికిస్తే విట‌మిన్ సి ని కోల్పోతాము. ట‌మాటాల‌ను రోజుకు 2 లేదా 3 కు మించి తిన‌కూడ‌దు. కూర‌ల్లో వేసినా, ఉడికించి లేదా ప‌చ్చిగా తిన్నా 3 ట‌మాటాల‌కు మించి తిన‌కూడ‌దు. ఎక్కువ టమోటాలు తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టమోటాలను పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రాశయ చికాకు వస్తుంది. టమోటా గింజలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉండటం మంచిది. ఆమ్లత్వం - ఉబ్బరం వంటి కడుపు సమస్యలను నివారించడానికి.. పరిమితుల్లో టమోటాలు తినాలని సూచిస్తున్నారు. ఇలా ట‌మాటాల‌ను తింటుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+