తెలంగాణా స్టైల్ పుల్లకంద పులుసు.. ఇలా చేసి తింటే స్వర్గానికి బెత్తెడే దూరం

మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి కావలసిన పోషకాలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు మనం వండుకు తినే కూరలలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇక అటువంటి మంచి పోషకాహారం కంద. దీనిని ఆంధ్రప్రదేశ్లో కంద గా, తెలంగాణలో పుల్ల కంద గా పిలుస్తారు.

పుల్ల కంద పులుసు

ముఖ్యంగా చలికాలంలో తెలంగాణ ఆంధ్ర గ్రామీణ ప్రాంతాల వంటకాలలో ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకంగా గుర్తించబడి, ఈ సీజన్ లో ఎక్కువగా తినే పుల్ల కంద పులుసు తెలంగాణ స్టైల్ లో ఎలా చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ఈ పులుసు మన నోటికి రుచిని మాత్రమే కాదు, మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది.

కావలసిన పదార్థాలు

పుల్ల కంద ముక్క - పావు కిలో( కట్ చేసుకున్న ముక్కలు)

ఉల్లిపాయలు- రెండు కట్ చేసి పెట్టుకున్నవి

పచ్చిమిరపకాయలు- నాలుగు కట్ చేసుకున్నవి

పసుపు- అర స్పూను

ఉప్పు- ఒకటిన్నర స్పూన్లు రుచికి తగినంత

కారం- ఒకటిన్నర స్పూను రుచికి తగినంత

జీలకర్ర మెంతుల పొడి - అర స్పూను

ధనియాల పొడి- ఒక స్పూను

పోపు గింజలు- ఒక స్పూను

నూనె- రెండు టేబుల్ స్పూన్లు

కరివేపాకు - రెండు రెమ్మలు

చింతపండు- నిమ్మకాయంత

pulla Kanda Pulusu is delicious in this making process know telangana style pulla kanda pulusu

తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత అందులో పోపు గింజలు వేయాలి. పోపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

పుల్ల కంద పులుసు ఇలా చేస్తే బెస్ట్ రుచి

ఆపై అందులో కట్ చేసి పెట్టుకొన్న పుల్ల కంద ముక్కలు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అందులో అర స్పూను పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు, ఒకటిన్నర స్పూన్ కారం వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మగ్గిన కూరలో పోసి తగినంత చిక్కదనాన్ని చూసుకొని సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి.

వీటితో పుల్ల కంద పులుసు తింటే సూపర్ గా ఉంటుంది

పులుసు మరుగుతుండగా అందులో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పుల్ల కంద పులుసు రెడీ అవుతుంది. దీనిని అన్నంలో కానీ జొన్న రొట్టెల లో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+