రాత్రి వేళ పసుపు పాలు తాగటం వెనుక సైన్స్ తెలిస్తే, వాటన్నిటికీ ఒకటే మందు..!!
పాలు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలల్లో ఉండే కాల్షియం, ఐరన్, ప్రొటీన్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ప్రయోజనకరం. అయితే..పాలలో కాస్త పసుపు కలిపి తాగితే.. ఆరోగ్యానికి ఇంకా మంచి దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉపయోగపడే కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా తాగటం వలన యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. పాలలో రాత్రిపూట ఒక గ్లాస్ పసుపు పాలు... ప్రశాంతత, మంచి నిద్ర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి తోడ్పాటు అందిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
నిత్యం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర చెంచా పసుపు కలిపి తాగితే శరీరం శుభ్రపడుతుంది. ఇందులో కొద్దిగా తేనె, అల్లం కలిపితే రుచి ఇంకా బాగుంటుంది. దీన్నే గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు. రాత్రి పడుకునే ముందు తాగితే నిద్ర బాగా పడుతుంది. శరీరంలోని అలసట తగ్గు తుంది.పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పసుపు పాలు తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు పాలు తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో పుష్కలం గా ఉన్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఇందుకు సహాయపడతాయి.
పసుపు పాలను క్రమంగా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనమూ దొరుకుతుంది.

నిపుణుల సూచనలు
కాగా, గోరువెచ్చగా ఉన్న పసుపు పాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. వీటిలో ఉన్న యాంటీ బాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలు.. జలుబు లాంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి. గొంతులో కఫం తగ్గించటంలోనూ పసుపు పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అదే విధంగా రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగటం వల్ల శరీరానికి, మనసుకు మంచి విశ్రాంతి దొరుకుతుంది. దీంతో సెరోటోనిన్ స్థాయిలు పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా గాఢ నిద్ర పట్టే అవకాశాలు పెరుగుతాయి. పసుపును మన రోజువారీ ఆహారంలో రకరకాలుగా చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు లభిస్తాయి. వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలపటంతో పాటుగా చిటికెడు మిరియాల పొడి వేసుకుంటే శోషణకు సహాయపడుతుంది. ఈ రకంగా తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.












Click it and Unblock the Notifications
