పవన్ కల్యాణ్ విడాకులపై మూడు రోజుల ముందే హింట్ ఇచ్చిన రేణు దేశాయ్
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తరచూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన సాధించిన విజయం, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆయన పోషిస్తోన్న పాత్ర.. ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుందో, ఆయన వైవాహిక జీవితం కూడా అంతే చర్చనీయాంశమౌతోన్నాయి. వివాహాలు, విడాకులు, కుటుంబ బంధాల అంశంపై ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది.
పవన్ కళ్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజ్నోవా విడిపోవడం, విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడం దీనికి కేంద్రబిందువు అయింది. తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. పరస్పర అవగాహన, గౌరవంతోనే తాము విడిపోవాలని ఉమ్మడిగా నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ పరిణామం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజకీయ, సినీ వర్గాల్లో డిబేట్స్ కు దారి తీసింది.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రెండో మాజీ భార్య రేణు దేశాయ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు మళ్లీ నెట్టింట చర్చకు దారితీశాయి. అన్నా లెజ్నెవాతో పవన్ కల్యాణ్ విడాకులు తీసుకోవడానికి సరిగ్గా మూడు రోజుల ముందు రేణు దేశాయ్ ఓ పాడ్ కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన ఈ ఇంటర్వ్యూ వీడియోలు వెలువడ్డాయి. ఇందులో ఆమె నేరుగా విడాకుల గురించి మాట్లాడారు.
సమాజంలో పురుషులు, మహిళల పునర్వివాహాల పట్ల ఉండే భిన్నమైన వైఖరిని ఆమె ప్రస్తావించారు. సమాజంలో ఒక పురుషుడు ఎన్ని వివాహాలు చేసుకున్నా సులువుగా ఆమోదించే ధోరణి ఉంటుందని, అదే ఒక మహిళ మరో వివాహం చేసుకుంటే తీవ్ర విమర్శలు, నెగెటివ్ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందనే కోణంలో ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ట్రోలింగ్ పురుషుడు ఎందుకు ఎదుర్కొనకూడదని వ్యాఖ్యానించారు. పవన్ తో విడిపోయి 14 సంవత్సరాలు అవుతున్నా తనను ఈ ట్రోలింగ్స్ వీడట్లేదని గుర్తు చేశారు.
విడాకుల తర్వాత మరాఠీలో ఓ సినిమా నిర్మించానని, అది సూపర్ హిట్ అయిందని రేణుదేశాయ్ చెప్పారు. మరో సినిమాకు కథను సమకూర్చానని, దాన్నిస్వీయదర్శకత్వంలో నిర్మించానని వివరించారు. అయినప్పటికీ తనను పవన్ మాజీ భార్యగానే గుర్తిస్తోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కను కాపాడినా తనను తిట్టిన సందర్భాలు ఉన్నాయని, పవన్ లేకపోతే జీవించే అర్హతే లేదు అన్నట్లుగా మాట్లాడారని బాధపడ్డారు.
పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం విషయానికి వస్తే, ఆయన 1997లో నందినిని మొదటి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం తనతో కలసి నటించిన రేణు దేశాయ్‌ను 2009లో వివాహమాడారు. వీరికి కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య జన్మించారు. 2012లో రేణు దేశాయ్‌తో విడిపోయారు పవన్ కల్యాణ్. ఆ మరుసటి ఏడాదే రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా లెజ్నెవాతో కూడా విడాకులు తీసుకున్నారాయన.














Click it and Unblock the Notifications
