షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు..
డయాబెటిస్ అంటే కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాదు.. అది మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 'టైప్-1' డయాబెటిస్‌తో బాధపడేవారికి భవిష్యత్తులో డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీకి చెందిన 'న్యూరాలజీ' పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ఇప్పుడు వైద్య లోకంలో చర్చనీయాంశమైంది.
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో సుమారు 2.83 లక్షల మందిపై ఈ సుదీర్ఘ అధ్యయనం జరిగింది. ఇందులో పాల్గొన్న వారి ఆరోగ్య రికార్డులను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

- టైప్-1 డయాబెటిస్: ఈ రోగులకు డిమెన్షియా వచ్చే అవకాశం ఇతరుల కంటే 3 రెట్లు ఎక్కువ.
- టైప్-2 డయాబెటిస్: వీరికి ఈ ప్రమాదం దాదాపు రెట్టింపు (2 రెట్లు) ఉంది.
గణాంకాల ప్రకారం, డయాబెటిస్ లేని వారిలో కేవలం 0.6% మందికి మాత్రమే డిమెన్షియా రాగా, టైప్-1 బాధితుల్లో అది 2.6% గా నమోదైంది.
ఎందుకింత ప్రమాదం?
వైద్య సంరక్షణ మెరుగుపడటంతో టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఇప్పుడు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. అయితే, వయస్సు పెరుగుతున్న కొద్దీ వారిలో మెదడు సంబంధిత సమస్యలు (Cognitive decline) తలెత్తుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. టైప్-1 అనేది అరుదైన వ్యాధి (మొత్తం డయాబెటిస్ కేసుల్లో 5% మాత్రమే) అయినప్పటికీ, దీని ప్రభావం మెదడుపై చాలా బలంగా ఉంటోందని డాక్టర్ జెన్నిఫర్ వివరించారు. ఈ వ్యాధికి సంబంధించిన 65% డిమెన్షియా కేసులను నేరుగా డయాబెటిస్‌కే ఆపాదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ముందు జాగ్రత్తే మార్గం
ఈ అధ్యయనం కేవలం డయాబెటిస్ మరియు డిమెన్షియా మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే చూపించింది తప్ప, ఒకదానికి ఒకటి కారణమని శాస్త్రీయంగా ఇంకా పూర్తిగా నిరూపించలేదు. అయినప్పటికీ, 65 ఏళ్లు పైబడిన డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మతిమరుపు వ్యాధిని నివారించడానికి లేదా ఆలస్యం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి.
-
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
అందరికీ బాగా నచ్చే "కొబ్బరి లౌజు" ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..? -
బీరకాయ పెరుగు పచ్చడి.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా! -
రెస్టారెంట్ స్టైల్ "జీడిపప్పు చికెన్ పకోడీ" ఇలా చేస్తే అదరహో !! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
"గుత్తి వంకాయ కారం" టేస్టే వేరబ్బా.. ఎప్పుడైనా ట్రై చేశారా..? -
అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు, వీరు మాత్రం దూరంగా ఉండాల్సిందే..!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?













Click it and Unblock the Notifications