విజయవాడ స్పెషల్ 'పునుగులు'.. ఇలా చేస్తే టేస్టు అదుర్స్..!

సాయంత్రం అలా బయటకు వెళ్లి పునుగులు, బజ్జీలు తినడం అంటే చాలా మందికి ఎక్కడ లేనంత ఇష్టం. రోడ్డు సైడు దొరికే ఈ పునుగులకు డిమాండ్ మామూలుగా ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా వీటిని తింటుంటారు. అయితే ఇంట్లోనే పునుగులను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో ఇక్కడ చూద్దాం.. కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం మీకోసం..

పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బియ్యం ఒక కప్పు, మినప్పప్పు అర కప్పు, పచ్చిశనగ పప్పు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, పచ్చిమిర్చి ముక్కలు తగినంత, అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తగినంత, కరివేపాకు తగినంత, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రైకు సరిపడా తీసుకోవాలి.

ఇప్పుడు తయారీ విధానం చూస్తే బియ్యం, మినప్పప్పు, శనగపప్పును శుభ్రంగా కడిగి 4 నుంచి 6 గంటల పాటు శుభ్రంగా నానబెట్టుకోవాలి. నీటిని వడపోసి, మృదువైన, మందపాటి పిండిగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని జోడించాలి. ఇప్పుడు పిండిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు జోడించి బాగా కలపాలి.

Vijayawada Special Punugulu Recipe Make Them This Way for Absolutely Amazing Taste amp amp Crispiness

ఆ తర్వాత కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా వేయాలి. ఆ తర్వాత అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చేంత వరకూ మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. దాంతో వేడి వేడి పునుగులను అల్లం పచ్చడి లేదా కారం పచ్చడితో వడ్డించుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ పునుగులు రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+