Vitamin B9: విటమిన్ బి9 లోపిస్తే అంతే సంగతి.. ఎందుకంటే..!
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సిన స్థాయిలో ప్రోటిన్లు, విటమిన్లు, మినరల్స్ అవసరం ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా శరీరంపై ప్రభావం చూపుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లలో విటమిన్ బి9 ఒకటి. విటమిన్ బి9 అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఈ విటమిన్ బి9 అనేది శరీరంలో డ్యామేజ్ అయిన సెల్స్‌ను బాగు చేస్తుంది. శరీరంలో విటమిన్ B9 ప్రధాన పాత్ర రక్తంలో ఉత్పత్తి అయ్యే అమైనో ఆమ్లాల స్థాయిని నియంత్రిస్తుంది.

హోమోసిస్టీన్
అందుకే దీనిని హోమోసిస్టీన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో విటమిన్ B9 తగినంత మొత్తంలో ఉండటం చాలా ముఖ్యం. అందుకే గర్భిణీలు మొదటి నెల నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఇది పిండం మెదడు అభివృద్ధిని నేరుగా ప్రభావితం చేస్తుంది.
అందుకే శరీరానికి బి9 విటమిన్ చాలా అవసరం. అయితే ఈ విటమిన్ బి9 లోపం వల్ల శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది.

జుట్టు తెల్లబడుతుంది
ఈ విటమిన్ లోపం కారణంగా జుట్టు తెల్లబడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వయస్సులోనే కేశాలు తెల్లబడితే శరీరంలో విటమిన్ బి9 లోపం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తరచూ ఆలసటగా ఉంటే విటమిన్ బి9 లోపం అని అర్థం చేసుకోవచ్చు. ఈ విటమిన్ మగవారిలో ఫెర్టిలిటీని పెంచుతుంది.వ్యాధుల్ని నిర్మూలించడంలో విటమిన్ బి9 సహయ పడుతుంది.

చేపల్లో
ఈ విటమన్ బి9 చేపల్లో పుష్కలంగా ఉంటుంది. మీరు గుడ్లు లేదా ఇతర నాన్-వెజ్ సంబంధిత వస్తువులను తినలేకపోతే బదులుగా సోయాబీన్స్ లో విటమిన్ బి9 అధికంగా ఉంటుంది.సోయా పాలు లేదా సోయాబీన్ నూనెను ఆహారంలో ఇది లభిస్తుంది. పన్నీరులో విటమిన్ B9తో పాటు ప్రోటీన్, కాల్షియం పెద్ద మొత్తంలో ఉంటాయి. ఆవాలు, బీట్‌రూట్, టర్నిప్, కసూరి మెంతులు, మొలకలు, సోయాబీన్, బచ్చలికూర, అన్ని రకాల ఆకుకూరల్లో బి9 పుష్కలంగా ఉంటుంది.

పెరుగు
శరీరానికి విటమిన్ బి9తో పాటు బి12 కూడా చాలా అవసరం. పెరుగులో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగులను విటమిన్ B12కు మంచి మూలంగా కూడా పరిగణిస్తారు. పుట్టగొడుగులలో మంచి మొత్తంలో ప్రోటీన్, విటమిన్ B12, కాల్షియం, ఐరన్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పన్నీర్‌లో విటమిన్ బి-12 ఉంటుంది. పనీర్ తీసుకోవడం ద్వారా మీకు ప్రోటీన్, కాల్షియం లభిస్తుంది. విటమిన్ B12 ను కోబాలమిన్ అని కూడా అంటారు.

ఎర్ర రక్త కణాలు
విటమిన్ B12 ఎర్ర రక్త కణాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మా నరాల కణాల సాధారణ పనితీరుకు మద్దతు ఇస్తుంది. DNA సంశ్లేషణలో సహాయపడుతుందట.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు విటమిన్ బి12 తీసుకోవాలి. గర్భధారణ సమయంలో విటమిన్ బి 12 లోపం ఉంటే, శిశువు పుట్టుకతో వచ్చే లోపంతో పుట్టే అవకాశం ఉంది.ఎర్ర రక్త కణాలు, నరాలు, DNA సంశ్లేషణ, ఇతర విధులను నిర్వహించడానికి మన శరీరానికి విటమిన్ B12 చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నరాు.












Click it and Unblock the Notifications