మద్యం కన్నా లివర్ కు ఈ ఆహారాలతోనే డేంజర్..!!
కాలేయం. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. కాలేయం మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది విషకారకాలను తొలగించేందుకు, గ్లైకోజెన్, విటమిన్లు, ఖనిజాల నిల్వలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. పోషకాలను ప్రాసెస్ చేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం అవసరం. మరి, కాలేయానికి మంచి శక్తి.. ఆరోగ్యం ఉండాలంటే కొన్ని ప్రమాదకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఈ మధ్య కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లతో లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్ సర్వసాధారణంగా మారుతోంది. ఆ తరువాత సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఆ సమస్యే క్యాన్సర్ గా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు లివర్ క్యాన్సర్ కూడా ఒక ప్రధాన కారణంగా గుర్తించారు. వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారంలో అజాగ్రత్తలు కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ రోజుల్లో, ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి అనేక కాలేయ సంబంధిత సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాలేయ క్యాన్సర్‌కు అత్యంత సాధారణ కారణం హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్. కానీ కొన్ని జీవనశైలి కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

కొన్ని ఆహార పదార్ధాలు మద్యం కంటే ఎక్కువగా కాలేయానికి నష్టం చేస్తాయని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసంలో అధిక మొత్తంలో ఇనుము, సంతృప్త కొవ్వులు ఉంటాయి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది కాలేయ క్యాన్సర్‌తో నేరుగా ముడిపడి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కూడా కాలేయంలో క్యాన్సర్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మొదట ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమై క్రమంగా క్యాన్సర్ సమస్యగా మారుతుంది. చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ మాత్రమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. జంక్ ఫుడ్స్ రోజూ తీసుకోవడం కాలేయానికి హానికరం. ఇది నాన్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక ఉప్పు కాలేయ వాపు తీవ్రతరం చేస్తుంది. ధూమపానం, రెడ్ మీట్ కూడా లివర్ క్యాన్సర్ కు కారణంగా నిలుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications