విటమిన్ బి12 లోపం లక్షణాలు- జాగ్రత్తలు, నిర్లక్ష్యం చేస్తే డేంజర్..!!
మన శరీరంలో అనేక జీవక్రియలను సరిగ్గా నిర్వహించడంలో విటమిన్ బి12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పర్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. డీఎన్ఏ సంశ్లేషణకు సహాయం చేస్తుంది. విటమిన్ బి12 లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొందరిలో స్వల్ప లేదా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. బీ12 లోపం సరి చేసుకొనే విషయం లో నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకు తెచ్చుకోవటమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విటమిన్ బీ12 శరీరంలో జీవక్రియల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. మాంసాహారాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించదు. శాకాహారుల్లో, కనీసం కోడిగుడ్లు తినని వారు లేదా పాలు తాగని వారు, పెరుగు, నెయ్యి వంటివి కూడా తినని వారిలో ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. కొందరు మాంసాహారం తింటున్నా ఇతర పోషకాహారాలను తినకపోవడం వల్ల కూడా విటమిన్ బి12 లోపం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. జీర్ణాశయ, పేగుల సమస్యలు ఉన్నా, శస్త్ర చికిత్సలు జరిగిన వారిలో, డయాబెటిస్ లేదా గ్యాస్ ట్రబుల్ మందులను వాడేవారిలో విటమిన్ బి12 లోపం వస్తుంది. బీ12 లోపం ఉంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపిస్తాయి. కొందరు డిప్రెషన్ బారిన పడతారు. చిరాగ్గా అనిపిస్తుంది.

ఇక రోజుకు ఎవరికి ఎంత మోతాదులో విటమిన్ బి12 అవసరం అవుతుందనే విషయానికి వస్తే 19 ఏళ్లకు పైబడిన వారికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల మేర విటమిన్ బి12 అవసరం. విటమిన్ బి12 మనకు ఎక్కువగా జంతు సంబంధ ఉత్పత్తుల్లో లభిస్తుంది. మటన్ లివర్, కిడ్నీలు, చేపలు, రొయ్యలు, పాలు, చీజ్, పెరుగు, కోడిగుడ్లు, చికెన్ వంటి ఆహారాలను తరచూ తింటుంటే విటమిన్ బి12ను పొందవచ్చు. పలు శాకాహారాల్లోనూ మనకు విటమిన్ బి12 స్వల్ప మోతాదులో లభిస్తుంది. ఫోర్టిఫైడ్ సిరియల్స్, సోయా పాలు, బాదం పాలు, న్యూట్రిషనల్ ఈస్ట్, పుట్టగొడుగులు వంటి శాకాహారాలను తినడం వల్ల కూడా విటమిన్ బి12 లభిస్తుంది. కానీ వీటిల్లో స్వల్ప మోతాదులో మాత్రమే ఈ విటమిన్ ఉంటుంది. ఇలా విటమిన్ బి12 ఉన్న ఆహారాలను రోజూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications